ప్రతి సమస్యకు ‘స్పందన’

ABN , First Publish Date - 2021-07-27T05:06:47+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కారం పొందవచ్చని కార్పొరేషన్‌ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఏ సమస్య అయినా సరే నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.

ప్రతి సమస్యకు ‘స్పందన’
అర్జీదారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ దినేష్‌ కుమార్‌

నిర్ణీత కాలంలో పరిష్కారం : కమిషనర్‌ దినేష్‌

నెల్లూరు (సిటీ), జూలై 26 : నెల్లూరు నగర పాలక సంస్థకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కారం పొందవచ్చని కార్పొరేషన్‌ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఏ సమస్య అయినా సరే నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా రోజుల విరామం తర్వాత సోమవారం నగర పాలిక కార్యాలయంలో ‘స్పందన’ జరిగింది. ప్రజలను కమిషనర్‌ అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగ అధిపతులను ఆదేశించారు. 

విద్యార్థులకు అభినందన 

మున్సిపల్‌ కార్పొరేషన్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న ఇంటర్‌ రెండవ ఏడాది విద్యార్థులను కమిషనర్‌ అభినందించారు. బైపీసీ విద్యార్థిని తనూజ 984 మార్కులు, ఎంపీసీ విద్యార్థి ప్రవీణ్‌ 982 మార్కులు సాధించి మిగత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా పోటీతత్వంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. ఆ కళాశాలలో 37 మంది విద్యార్థులు 95 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధించారని చెప్పారు.

Updated Date - 2021-07-27T05:06:47+05:30 IST