Helmet: ప్రొటెక్టివ్‌ హెడ్‌ గేర్‌ విడుదలతో కన్జ్యుమర్ విభాగంలోకి స్పార్క్‌ మిండా

ABN , First Publish Date - 2022-07-22T00:21:29+05:30 IST

స్పార్క్‌ మిండా (Spark Minda) గ్రూపునకు ప్రతిష్ఠాత్మక విభాగమైన మిండా కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (MINDACORP)

Helmet: ప్రొటెక్టివ్‌ హెడ్‌ గేర్‌ విడుదలతో కన్జ్యుమర్ విభాగంలోకి స్పార్క్‌ మిండా

న్యూఢిల్లీ:  స్పార్క్‌ మిండా (Spark Minda) గ్రూపునకు  ప్రతిష్ఠాత్మక విభాగమైన మిండా కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (MINDACORP) 17 హెల్మెట్‌ మోడల్స్‌ను 145 వేరియంట్లలో భారతీయ రిటైల్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఆవిష్కరణతో  అంతర్జాతీయంగా  అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశపు హెల్మెట్‌ మార్కెట్‌లో బీ2సీ విభాగంలో స్పార్క్‌ మిండా ప్రవేశించినట్లయింది.


రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ కంపెనీ 200కు పైగా డిస్ట్రిబ్యూటర్లును జోడించడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశ వ్యాప్తంగా స్పార్క్‌ మిండా బ్రాండెడ్‌ ఔట్‌లెట్లను తెరవడం ద్వారా తమ పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయనుంది. ఈ ప్రొటెక్టివ్‌ హెడ్‌‌గేర్‌  ఎకనమీ (నైట్‌ సిరీస్‌), మిడ్‌ (గారిసన్‌ సిరీస్‌), ప్రీమియం (ఆర్మోరెడ్‌ సిరీస్‌)లలో లభిస్తాయి.


1500 ఫైబర్‌ భాగాలు (ప్లాస్టిక్‌ మౌల్డెడ్‌, పెయింటెడ్‌ విడిభాగాలను ద్విచక్రవాహనాల కోసం) విడుదల చేసినట్లు స్పార్క్‌మిండా   వెల్లడించింది. దేశవ్యాప్తంగా ద్విచక్రవాహన రైడర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను ఇవి తీర్చనున్నాయి. ఈ సంఖ్యను రాబోయే రెండు సంవత్సరాలలో 2400కు చేర్చనున్నారు. తద్వారా దేశంలో అతిపెద్ద శ్రేణి ఫైబర్‌ భాగాల లభ్యతకు ప్రాతినిధ్యం వహించనుంది.


ఈ సందర్భంగా మిండా కార్పొరేషన్‌ లిమిటెడ్‌  ఛైర్మన్‌, గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌  అశోక్‌ మిండా మాట్లాడుతూ… గత ఆరు దశాబ్దాలుగా స్పార్క్‌ మిండా ఆటోమోటివ్‌ పరిశ్రమలో అగ్రగామి పరిష్కారాలను అందిస్తున్నట్టు చెప్పారు. గ్రూప్‌ అనుభవంతో పాటుగా విస్తృతశ్రేణి పరిశోధనలు సైతం మిళితమై భవిష్యత్‌ కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేసే విషయంలో  మిగిలిన సంస్థల కంటే ముందున్నట్టు చెప్పారు. 


మిండా కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆఫ్టర్‌ మార్కెట్‌ డివిజన్‌  సీఈవో  నీరజ్‌ శరణ్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద హెల్మెట్‌ మార్కెట్‌ గా ఇండియా నిలుస్తోందన్నారు. ఇక్కడ ఇప్పటికీ 40–45 శాతం అవసరాలను అసంఘటిత రంగంలోని సంస్థలే తీరుస్తున్నట్టు చెప్పారు. భారతదేశంలో ప్రతి ద్విచక్రవాహనదారునికీ సర్టిఫైడ్‌ హెల్మెట్స్‌ లభ్యమవుతాయనే భరోసా అందిస్తున్నట్టు పేర్కొన్నారు.  


ప్రస్తుతం, స్పార్క్‌ మిండా వద్ద ఆఫ్టర్‌ మార్కెట్‌ డివిజన్‌కు 500కు పైగా డిస్ట్రిబ్యూటర్లు, 12వేలకు పైగా రిటైలర్లు దేశవ్యాప్తంగా ఉన్నారు. దీనికి 12 ప్రొడక్ట్‌ లైన్స్‌ ఉన్నాయి. వీటిలో లాక్స్‌, వైరింగ్‌ హార్నెస్‌, ఇన్‌స్ట్రుమెంట్స్‌, ఆటో ఎలక్ట్రికల్‌ విడిభాగాలు (స్టార్టర్‌ మోటర్‌), ఫ్లాషర్‌, రీలేస్‌, సీడీఐ, వైపర్‌, కేబుల్‌, ఫిల్టర్‌, లూబ్రికెంట్‌, బ్రేక్‌ షూ, క్లచ్‌ ప్లేట్‌, బేరింగ్‌ ఉన్నాయి.

Updated Date - 2022-07-22T00:21:29+05:30 IST