కత్రీనా, మలైకాని చూసి ఎంతో నేర్చుకున్నా అంటోన్న NIA SHARMA!

Published: Sun, 16 Jan 2022 19:53:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కత్రీనా, మలైకాని చూసి ఎంతో నేర్చుకున్నా అంటోన్న NIA SHARMA!

తన తాజా వీడియో సాంగ్ ‘ఫూంక్ లే’ గురించి మాట్లాడింది బాలీవుడ్ హాటీ నియా శర్మ. తనకు ఆ పాట చేసేందుకు కత్రీనా, మలైకాలే ప్రేరణ అంటూ వివరించింది. ‘‘నేను ఎదుగుతోన్న క్రమంలో ‘ఛయ్యా ఛయ్యా’ పాట చూస్తూ పెరిగాను. ఇక కత్రీనా తాను ఏ సాంగ్ చేసినా అద్భుతంగా రక్తి కట్టిస్తుంది. ‘షీలా కీ జవానీ, కమ్లీ’... ఆమెలో అగ్గి దాగుంది!’’ అంటూ తన సిల్వర్ స్క్రీన్ ఐడల్స్‌ని, వారి పాటల్ని గుర్తు చేసుకుంది నియా.


‘ఫూంక్ లే’ పాటతో ఇంటర్నెట్‌లో కలకలం రేపిన నియా శర్మ ఐటెం నెంబర్స్‌కు క్రేజ్ ఎంతగా ఉంటుందో మరోసారి నిరూపించింది. గతంలో మలైకా, కత్రీనా లాంటి వారిలాగే ఆమె కూడా ఇప్పుడు యూత్‌కు హాట్ ఫేవరెట్ అయిపోయింది. అయితే, ‘ఫూంక్ లే’ షూట్‌కి ముందు ‘‘మలైకా ‘మున్నీ బద్నామ్’ సాంగ్‌ను చూస్తూ... నేను చాలా హోమ్‌వర్క్ చేశాను’’ అని కూడా మురిపెంగా చెబుతోంది. ఆమె కష్టం మనకు తెరపై ‘ఫూంక్ లే’ పాటలో కనిపిస్తుంది కూడా... 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...