వైసీపీ అరాచకాలను అడ్డుకుందాం

ABN , First Publish Date - 2021-02-27T03:28:07+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పేట్రేగిపోయాయని, వాటిని ఎదురొడ్డి నిలవడానికి ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడై నిలవాలని, టీడీపీ కార్యకర్తలపై గ్రామాల్లో దాడి చేసే వైసీపీ నేతల్ని తరిమికొట్టాలని నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పిలుపునిచ్చారు.

వైసీపీ అరాచకాలను అడ్డుకుందాం
కలిగిరిలో మాట్లాడుతున్న అబ్దుల్‌ అజీజ్‌

టీడీపీ నేతలు అబ్దుల్‌అజీజ్‌, బొల్లినేని

కలిగిరి, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పేట్రేగిపోయాయని, వాటిని ఎదురొడ్డి నిలవడానికి ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడై నిలవాలని, టీడీపీ కార్యకర్తలపై గ్రామాల్లో దాడి చేసే వైసీపీ నేతల్ని తరిమికొట్టాలని నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అజీజ్‌ మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తుందని, వలంటీర్లచే ప్రభుత్వ పథకాలు అందవని భయపెట్టి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రెండేళ్లయినా ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని, నియోజకవర్గంలో అవినీతి తాండవిస్తుందని, ప్రతి మండలానికి ఒక కమీషన్‌ ఏజెంట్‌ను పెట్టుకొని లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు రాజకీయ, వ్యాపార స్వలాభాపేక్ష చూసుకుని ప్రస్తుతం ముఖం చాటేస్తూ అధికార పార్టీకి సహకరించేవాళ్లను తరిమికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రతి పేదవానికి అందుతాయని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు వడ్డీతో సహా వస్తాయన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచే పార్టీనీ బలోపేతం చేసుకుని విజయం సాధించడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకువెళ్లాలని సూచించారు. అనంతరం ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిది మండలాల్లో గెలుపొందినసర్పంచులను ఘనంగ సన్మానించారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, పీ.చెంచలబాబుయాదవ్‌, పమిడి రవికుమార్‌ చౌదరి, కాకి ప్రసాద్‌, దామా మహేష్‌, ఒంటేరు జయచంద్రారెడ్డి, బీవీ రామారావు, బిజ్జం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T03:28:07+05:30 IST