పంచాయతీలకు ప్రత్యేక ఖాతాలు

Published: Mon, 28 Mar 2022 00:17:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పంచాయతీలకు ప్రత్యేక ఖాతాలు మావల గ్రామ పంచాయతీ కార్యాలయం

జిల్లాలోని అన్ని జీపీలకు బ్యాంకు ఖాతాలు
కేంద్రం నుంచి నేరుగా నిధుల మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించకుండా కట్టడి
ఫ్రీజింగ్‌ ‘పంచాయితీ’ ఉండదు ఇక..
ఏప్రిల్‌ 1 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 468 గ్రామ పంచాయతీలు

ఆదిలాబాద్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ నిధులపై ఆర్థిక ఆంక్షలు విధించకుండా ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం అందిస్తున్న నిధులపై రాష్ట్ర సర్కారు ఆజమాయిషీ లేకుండా సర్పంచ్‌లు నిధులను వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీ కొత్తగా బ్యాంకు ఖాతాల ను తెరవాలని సూచించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి అన్ని గ్రా మ పంచాయతీలలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ జాయింట్‌గా అకౌంట్లను సిద్ధం చేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్‌ అధికారు లు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా సర్పంచ్‌లంతా  కొత్త బ్యాంకు ఖాతాలను తెరిచే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఐదు లక్షలకు పైగానే ఉ న్నారు. గ్రామ జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులను కేటా యిస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను కొత్త ఖాతాలలోనే జమ చేయనుంది. ఈ నిధునలు సర్పంచ్‌లు గ్రామ అవసరాల కోసం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాని ఇన్నాళ్లు గ్రామ పంచాయతీకి ఒకే బ్యాంకు ఖాతా ఉండేది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం ప్రతీ గ్రామ పంచాయతీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు గా బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో యేడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీకి అందించే నిధులపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది.
నిధులు ఉన్నా.. తీసుకోలేని పరిస్థితి
ఇన్నాళ్లు గ్రామ పంచాయతీ అకౌంట్లలో సరిపడా నిధులు ఉన్న సర్పంచ్‌లకు తీసుకోలేని పరిస్థితి ఉండేది. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పనులను చేపట్టినా ట్రెజరీలో నెలల తరబడి చెక్కులు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. చెక్‌పాస్‌ చేయడంలో జాప్యం జరుగుతూ ఉండేది. దీంతో సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారు. గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లు ఆసక్తి చూపకపోయేవారు. ఎందుకంటే అప్పు సప్పు చేసి పనులు పూర్తి చేసిన బిల్లులు నెలల తరబడి ఆలస్యం కావడంతో ఇబ్బందికరంగా మారేది. అప్పులు ఇచ్చే వారికి చెక్‌ పాస్‌ కాలేదంటూ పలుమార్లు తిప్పుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు ఎత్తివేస్తేనే నిధులు డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కాని ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానంతో స్థానికంగా పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లుల చెల్లింపులకు అవకాశం ఏర్పడింది.
కొత్త ఖాతాల్లోనే నిధుల జమ
కేంద్ర ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులను కొత్తగా ఓపెన్‌ చేసిన పంచాయతీ ఖాతాల్లోనే జమ చేయనున్నారు. వీటితో పాటు గ్రామ పంచాయతీకి ఆదాయ రూపంలో వచ్చే నిధులను ఈ ఖాతాలోనే జమ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. పనులు పూర్తికాగానే నిధులను డ్రా చేసుకునే అవకాశం ఉం ది. పీఎఫ్‌ఎంఎస్‌ (పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) ద్వారా సర్పంచ్‌లు నిధులను వినియోగించుకునే అవ కాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీ నిధులపై ఆర్థిక ఆంక్షలు విధించకుండా కట్టడి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల పర్యవేక్షణ, నిధుల కేటాయింపునకు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీలకు నిధుల వినియోగంలో మరింత స్వేచ్ఛను కల్పించేందుకు కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని గ్రామ పంచాయతీలన్ని దాదాపుగా బ్యాంకు ఖాతాలను ఓపెన్‌ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కొత్త ఖాతాలను తెరవాలని ఆదేశాలున్నాయి
: కళ్లెం కరుణాకర్‌రెడ్డి, సర్పంచ్‌, తలమడుగు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త ఖాతాలను తెరవాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో అధికారులు సూచించిన విధంగా సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ జాయింట్‌ ఖాతాలను ఓపెన్‌ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు ఈ ఖాతాలోనే జమ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఒకే ఖాతా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం యేడా దిలో సగం రోజులు ప్రీజింగ్‌ పెట్టడంతో నిధు లు ఉన్నా.. తీసుకునే పరిస్థితి లేకపోయేది. నె లల తరబడి చెక్కులు పాస్‌కాక ఎదురు చూడాల్సి వచ్చేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యే అవకాశం ఉంది.
అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలిచ్చాం
: శ్రీనివాస్‌, డీపీవో, ఆదిలాబాద్‌
కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే దాదాపుగా బ్యాంకు ఖాతాల ఓపె నింగ్‌ పూర్తయ్యింది. కొన్ని జీపీలు బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉం ది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే కొత్త బ్యాంకు ఖాతాలను తెరవాలని సంబంధిత సర్పంచ్‌లకు ఆదేశాలిచ్చాం. మునుపటి మాదిరిగానే సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ జాయింట్‌గా బ్యాంకు అ కౌంట్లను ఓపెన్‌ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఖాతా లావాదేవీలు జరపాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు జమయ్యే అవకాశం ఉంది. ఇంకా పూర్తి విధి విధానాలు రావాల్సి ఉంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.