ఒమన్‌లోని తెలంగాణవాసులకు ప్రత్యేక విమానం

ABN , First Publish Date - 2020-07-07T07:07:14+05:30 IST

ఒమన్‌లో చిక్కుకున్న తెలంగాణవాసులను తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఒమన్‌ శాఖ, డెక్కన్‌ వింగ్‌ (ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌) సంయుక్తంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించాయి. వాస్తవానికి ఇది మస్కట్

ఒమన్‌లోని తెలంగాణవాసులకు ప్రత్యేక విమానం

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఒమన్‌లో చిక్కుకున్న తెలంగాణవాసులను తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఒమన్‌ శాఖ, డెక్కన్‌ వింగ్‌ (ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌) సంయుక్తంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించాయి. వాస్తవానికి ఇది మస్కట్‌ నుంచి జూలై 1న రావాల్సి ఉంది. కానీ, సాంకేతిక కారణాల వల్ల అనుమతులు రాలేదు. ఈ విషయంపై సీఎం కార్యాలయం అధికారులతో టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో-ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల మాట్లాడి అనుమతులు వచ్చేలా చొరవ తీసుకున్నారు. ప్రత్యేక విమానం మంగళవారం మస్కట్‌ నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకోనుంది.

Updated Date - 2020-07-07T07:07:14+05:30 IST