బడ్జెట్ 2022... ప్రత్యేక యాప్​..

ABN , First Publish Date - 2022-01-28T23:56:23+05:30 IST

మరో మూడు రోజుల్లో తెరమీదకు రానున్న కేంద్ర బడ్జెట్‌తో పాటు... బడ్జెట్ వివరాలను వెల్లడించేందుకుగాను ప్రత్యేకంగా ఓ అప్లికేషన్ కూడా రానుంది.. ఈ సారీ కేంద్ర బడ్జెట్​ను డిజిటల్​ రూపంలోనే ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

బడ్జెట్ 2022... ప్రత్యేక యాప్​..

న్యూఢిల్లీ : మరో మూడు రోజుల్లో తెరమీదకు రానున్న కేంద్ర బడ్జెట్‌తో పాటు... బడ్జెట్ వివరాలను వెల్లడించేందుకుగాను ప్రత్యేకంగా ఓ అప్లికేషన్ కూడా రానుంది.. ఈ సారీ కేంద్ర బడ్జెట్​ను డిజిటల్​ రూపంలోనే ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.... సాధారణ పౌరులు బడ్జెట్​ వివరాలను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్​ను తీసుకొచ్చింది కేంద్రం. రానున్న ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ పూర్తిగా పేపర్​ లెస్​గా ఉండనుంది. దీనితో బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరికొత్త మొబైల్​ యాప్​ను  తీసుకొచ్చింది. వివరాలిలా ఉన్నాయి. 


2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి ఊరెీన పార్లమెంట్​లో బడ్జెట్‌ను   ప్రవేశపెట్టనున్నారు. కాగా... పూర్తి స్థాయిలో పేపర్​లెస్​గా బడ్జెట్ ప్రవేశపెడుతుండటం ఇది రెండో సారి. గతేడాది కూడా సాఫ్ట్​ కాపీ రూపంలోనే బడ్జెట్​ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. కరోనా సంక్షోభం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో పార్లమెంట్​ సభ్యులు(ఎంపీలు), సాధారణ పౌరులు బడ్జెట్​ వివరాలను సులంభంగా చదివేందుకు వీలుగా కేంద్రం 'యూనియన్​ బడ్జెట్​ మొబైల్​ యాప్​'ను ప్రారంభించింది.


ప్లేస్టోర్ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు...  

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఈ మొబైల్​ యాప్​లో బడ్జెట్​కు సంబంధించిన వివరాలన్నింటిని తెలుసుకోవచ్చు. ఇప్పటికే ప్లే స్టోర్​, యాప్​ స్టోర్లలో ఈ యాప్ డౌన్​లోడ్​లకు అందుబాటులో ఉంది. 

Updated Date - 2022-01-28T23:56:23+05:30 IST