ఆయిల్‌ పాం సాగుపై రైతులకు ప్రత్యేక అవగాహన

ABN , First Publish Date - 2021-07-28T05:57:10+05:30 IST

మండలంలోని బైరాపూర్‌ గ్రామంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం బైరాపూర్‌ క్లస్టర్‌ పరిధిలోని రైతులకు ఆయిల్‌ పాం సాగుపై ఆయిల్‌ పాం డిప్యూటీ మేనేజర్‌ వెంకటేశ్వర్లు ప్రత్యేక అవగా హన కల్పించారు.

ఆయిల్‌ పాం సాగుపై రైతులకు ప్రత్యేక అవగాహన
బైరాపూర్‌లో ఆయిల్‌ పాం సాగుపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం

బీర్కూర్‌, జూలై 27: మండలంలోని బైరాపూర్‌ గ్రామంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం బైరాపూర్‌ క్లస్టర్‌ పరిధిలోని రైతులకు ఆయిల్‌ పాం సాగుపై ఆయిల్‌ పాం డిప్యూటీ మేనేజర్‌ వెంకటేశ్వర్లు ప్రత్యేక అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఒకే రకమైన పంటలను వేస్తూ నష్టపోతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడిని చేసి రైతులకు లాభా ల బాట పట్టించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా రైతులు తమ పంట పొలాల్లో ఆయిల్‌ పాం మొక్కలను పెంచాలని, దీంతో అధిక లాభాలు గడించవచ్చన్నారు. ఆయిల్‌ పాం సాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి మూడు సంవత్సరాల పాటు సబ్సిడీ అందజేస్తుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బరం గ్‌ఎడ్గి రైతుబంధు కన్వీనర్‌ గంగాధర్‌, రాంబాబు, సభ్యులు పండరి, గంగా రాం, ఢీకొండ మురళి, బరంగ్‌ఎడ్గి, బైరాపూర్‌, తిమ్మాపూర్‌, సంబాపూర్‌, మల్లాపూర్‌, తదితర గ్రామాల రైతులు, ఏఈవో కావ్యశ్రీ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T05:57:10+05:30 IST