దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్‌

ABN , First Publish Date - 2021-03-07T05:14:24+05:30 IST

దిశ’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ప్రతి మహిళకూ ఎంపిక చేసిన దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో 55 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనున్నట్లు కడప డీఎస్పీ బి.సునీల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్‌

షాపింగ్‌ మాల్స్‌, దుకాణాల్లో 55 శాతం వరకు డిస్కౌంట్‌ : డీఎస్పీ సునీల్‌


కడప (క్రైం), మార్చి 6 : ‘దిశ’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ప్రతి మహిళకూ ఎంపిక చేసిన దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో 55 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనున్నట్లు కడప డీఎస్పీ బి.సునీల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలు, విద్యార్థినులపై జరిగే దాడులను నిరోధించేందుకు దిశ బిల్లును, దిశ యాప్‌ను తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఆ మేరకు డీఎస్పీ సునీల్‌, వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి మహిళకు 10 శాతం నుంచి 55 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్‌ ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. నగరంలోని ఎంపిక చేసిన దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో డిస్కౌంట్లు ఇవ్వడానికి వ్యాపార వర్గాలు ముందుకు వచ్చాయన్నారు. గూగుల్‌ ప్లే స్టోరు నుంచి దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చే సుకోవచ్చన్నారు. దిశ యాప్‌ ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. కావున ఈ సదవకాశాన్ని మహిళలు, విద్యార్థినులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసు వారి తరపున ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి ముందుకు వచ్చి దుకాణ యజమానులకు డీఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-03-07T05:14:24+05:30 IST