హౌ ఈజ్‌ జోష్‌!

ABN , First Publish Date - 2020-12-26T06:18:16+05:30 IST

న్యూ ఇయర్‌ పార్టీ అంటే నోటికి కాస్త మసాలా ఘాటు తగలాల్సిందే. అందులోనూ కాస్త ప్రత్యేకమైన వంటలు ఉంటే ఆ జోషే వేరు. స్టఫ్‌డ్‌ మష్రూమ్స్‌, టోస్టెడ్‌ రావియోలి, పనీర్‌ టిక్కా మసాలా, పనీర్‌ అఫ్ఘానీ వంటి రెసిపీలతో...

హౌ ఈజ్‌ జోష్‌!

న్యూ ఇయర్‌ పార్టీ అంటే నోటికి కాస్త మసాలా ఘాటు తగలాల్సిందే. అందులోనూ కాస్త ప్రత్యేకమైన వంటలు ఉంటే ఆ జోషే వేరు. స్టఫ్‌డ్‌ మష్రూమ్స్‌, టోస్టెడ్‌ రావియోలి, పనీర్‌ టిక్కా మసాలా, పనీర్‌ అఫ్ఘానీ వంటి రెసిపీలతో ఇంటిల్లిపాది కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి.



ప్రాన్స్‌ టిక్కా మసాలా

కావలసినవి

ప్రాన్స్‌ - 10 (రొయ్యలు పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి), నిమ్మరసం - అర టీస్పూన్‌, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పెరుగు - అరకప్పు, క్రీమ్‌ - పావు కప్పు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో ప్యూరీ - అరకప్పు, కశ్మీరీ కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టేబుల్‌స్పూన్‌, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ విధానం

  1. ఒక పాత్రలో శుభ్రంగా కడిగిన ప్రాన్స్‌ తీసుకోవాలి. అందులో నిమ్మరసం, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  2. స్టవ్‌పై ఒక మందపాటి పాన్‌ తీసుకుని వెన్న వేసి వేడి చేయాలి. తరువాత రొయ్యలు వేసి చిన్నమంటపై నాలుగైదు నిమిషాలు వేగించి మరో పాత్రలోకి  తీసుకుని పక్కన పెట్టాలి.
  3. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించుకోవాలి.
  4. అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. కారం, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి.
  5. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసి చిన్నమంటపై మరో నాలుగు నిమిషాలు ఉడికించాలి. 
  6. తరువాత మిశ్రమం చిక్కబడుతున్న సమయంలో క్రీమ్‌, పెరుగు, గరంమసాల వేసి కలియబెట్టుకోవాలి.
  7. చివరగా వేగించి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి.
  8. కాసేపు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపుకోవాలి. 
  9. చపాతీలోకి లేదా అన్నంలోకి ఈ రొయ్యల మసాల కర్రీ రుచిగా ఉంటుంది.




పనీర్‌ అఫ్ఘానీ

కావలసినవి 

పనీర్‌ - 500 గ్రాములు, పుచ్చకాయ గింజలు - ఒక టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు - ఒక కప్పు, గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్‌(గంటపాటు నానబెట్టుకోవాలి), క్రీమ్‌ - ఒక కప్పు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలు - రెండు టీస్పూన్లు, యాలకులు - ఐదారు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం

  1. పనీర్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
  2. పుచ్చకాయ గింజలు, జీడిపప్పు, గసగసాలు, మిరియాలు, యాలకులను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి.
  3. ఒక పాత్రలో పనీర్‌ ముక్కలు తీసుకుని అందులో ఆ పొడి వేయాలి. తరువాత క్రీమ్‌, వెన్న, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 
  4. తరువాత వీటిని ఎలక్ర్టిక్‌ గ్రిల్‌పై లేదా తందూరీ స్టయిల్‌లో కాల్చి వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.



ఫ్రైడ్‌ ఆనియన్‌ రింగ్స్‌


కావలసినవి

  1. ఉల్లిపాయలు - నాలుగైదు, బ్రెడ్‌ ముక్కలు - అరకప్పు.
  2. మైదా మిశ్రమం: మైదా - ఒక కప్పు, ఉప్పు - తగినంత, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, వెల్లుల్లి పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టీస్పూన్‌, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, వాము ఆకు పొడి (ఒరెగానో) - ఒక టీస్పూన్‌.
  3. ఎగ్‌ మిక్స్‌: ఎగ్‌వైట్‌ - ఒకటి, ఉప్పు - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌.


తయారీ విధానం

  1. ఒక పాత్రలో మైదా తీసుకుని అందులో ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఒరెగానో వేసి కలపాలి
  2. ఆలివ్‌ ఆయిల్‌, పాలు పోయాలి. అరకప్పు నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలపాలి.
  3. మరొక పాత్రలో ఎగ్‌వైట్‌ తీసుకుని అందులో మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి.
  4. ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ ముక్కలు తీసుకోవాలి.
  5. ఉల్లిపాయలు గుండ్రంగా తరిగి, మైదా మిశ్రమంలో డిప్‌ చేయాలి.
  6. తరువాత ఎగ్‌వైట్‌లో డిప్‌ చేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కలు అద్ది పక్కన పెట్టుకోవాలి.
  7. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలు అద్ది పెట్టుకున్న రింగ్స్‌ వేసి వేగించాలి.
  8. చట్నీతో తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.




కావలసినవి

ఉల్లిపాయలు - నాలుగైదు, బ్రెడ్‌ ముక్కలు - అరకప్పు.

మైదా మిశ్రమం: మైదా - ఒక కప్పు, ఉప్పు - తగినంత, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, వెల్లుల్లి పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టీస్పూన్‌, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, వాము ఆకు పొడి (ఒరెగానో) - ఒక టీస్పూన్‌.

ఎగ్‌ మిక్స్‌: ఎగ్‌వైట్‌ - ఒకటి, ఉప్పు - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌.

తయారీ విధానం

ఫ ఒక పాత్రలో మైదా తీసుకుని అందులో ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఒరెగానో వేసి కలపాలి

ఫ ఆలివ్‌ ఆయిల్‌, పాలు పోయాలి. అరకప్పు నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలపాలి.

ఫ మరొక పాత్రలో ఎగ్‌వైట్‌ తీసుకుని అందులో మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి.

ఫ ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ ముక్కలు 

తీసుకోవాలి.

ఫఉల్లిపాయలు గుండ్రంగా తరిగి, మైదా మిశ్రమంలో డిప్‌ చేయాలి.

ఫ తరువాత ఎగ్‌వైట్‌లో డిప్‌ చేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కలు అద్ది పక్కన పెట్టుకోవాలి.

ఫస్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలు అద్ది పెట్టుకున్న రింగ్స్‌ వేసి వేగించాలి.

ఫచట్నీతో తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.



టోస్టెడ్‌ రావియోలి


కావలసినవి

రావియోలి(ఒక రకం పాస్తా) - పావుకేజీ, కోడిగుడ్లు - రెండు, పాలు - ఒకటిన్నర కప్పు, బ్రెడ్‌ ముక్కలు - రెండు కప్పులు, కొత్తిమీర - ఒకకట్ట, రోజ్‌మేరీ - కొద్దిగా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, పర్మేసన్‌ చీజ్‌ - అర కప్పు.


తయారీ విధానం

  1. బేకింగ్‌ షీట్‌లో రావియోలి పెట్టుకుని అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.
  2. ఒకపాత్రలో కోడిగుడ్లు పగలగొట్టి పక్కన పెట్టుకోవాలి.
  3. మరొక పాత్రలో బ్రెడ్‌ ముక్కలు, కొత్తిమీర, రోజ్‌మేరీ, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
  4. కోడిగుడ్డు మిక్చర్‌లో రావియోలి ముక్కలను డిప్‌ చేసుకుంటూ, బ్రెడ్‌ ముక్కలను కోట్‌లా అద్దుకోవాలి.
  5. తిరిగి బేకింగ్‌ షీట్‌లో పెట్టి మరో పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.
  6. తరువాత స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక రావియోలను వేసి వేగించాలి.
  7. సన్నగా తరిగిన పర్మేసన్‌ చీజ్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

స్టఫ్‌డ్‌ మష్రూమ్స్‌


కావలసినవి

పుట్టగొడుగులు - 250గ్రాములు(పెద్దసైజువి), అల్లం పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, జున్ను - అరకప్పు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత. 


తయారీ

  1. పుట్టగొడుగులను శుభ్రం చేసుకోవాలి.
  2. ఒక పాన్‌ తీసుకొని కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ, అల్లం పేస్టు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి దింపాలి.
  3. చల్లారిన తరువాత జున్ను, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి.
  4. ఈ స్టఫ్‌ను పుట్టగొడుగుల్లో కూరాలి.
  5. తరువాత ఓవెన్‌లో ఉడికించుకుని వడ్డించాలి.

Updated Date - 2020-12-26T06:18:16+05:30 IST