నిరుద్యోగుల ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక డ్రైవ్ పెట్టాలి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-12T03:13:13+05:30 IST

నిరుద్యోగుల ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక డ్రైవ్ పెట్టాలి: రేవంత్‌రెడ్డి

నిరుద్యోగుల ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక డ్రైవ్ పెట్టాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగుల ధ్రువపత్రాల సమస్యపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 8 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సంతోషపడాలో.. ఏడ్వాలో అనే సందిగ్ధంలో నిరుద్యోగులున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కుల, ఆదాయ, ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల దగ్గర నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. అవసరమైన ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Read more