నీటి బిల్లుల వసూలుకు నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-06-28T06:13:15+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీ లో పేరుకుపోయిన నీటి బిల్లుల వసూలుకు అధికారులు మంగళవారం నుం చి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. బకాయిలను చెల్లించకుంటే నల్లా కనెక్షన్‌ తొలగిస్తామని మునిసిపల్‌ అధికారులు హెచ్చరించారు. భువనగిరి పట్టణంలో మునిసిపాలిటీ పరిధిలో 8,367 నల్లాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజు సుమారు 6లక్షల లీటర్ల తాగునీటిని మునిసిపాలిటీ సరఫరా చేస్తోంది.

నీటి బిల్లుల వసూలుకు నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

భువనగిరి మునిసిపాలిటీలో 8,367 నల్లాలు

నెలవారీ రావల్సిన బిల్లు రూ.1కోటి

ఇప్పటి వరకు రూ.3.40కోట్లు బకాయి


భువనగిరి టౌన్‌, జూన్‌ 27: జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీ లో పేరుకుపోయిన నీటి బిల్లుల వసూలుకు అధికారులు మంగళవారం నుం చి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. బకాయిలను చెల్లించకుంటే నల్లా కనెక్షన్‌ తొలగిస్తామని మునిసిపల్‌ అధికారులు హెచ్చరించారు. భువనగిరి పట్టణంలో మునిసిపాలిటీ పరిధిలో 8,367 నల్లాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజు సుమారు 6లక్షల లీటర్ల తాగునీటిని మునిసిపాలిటీ సరఫరా చేస్తోంది. పట్టణానికి కృష్ణా జలాల సరఫరాకు చేస్తున్నందుకు హైదరాబాద్‌ జల మండలి కి నెలకు సుమారు రూ.15లక్షలను భువనగిరి మునిసిపాలిటీ చెల్లిస్తోంది. దీనికి స్థానిక విద్యుత్‌ బిల్లులు, నీటి సరఫరా విభాగంలో పని చేసే ఔట్‌ సో ర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు, పైపులైన్‌ నిర్వహణ వ్యయం అదనం. కాగా, ము నిసిపాలిటీకి నల్లా బిల్లుల రూపంలో ఏటా రూ.1,03,18,000 వసూలు కావ ల్సి ఉంది. అయితే వినియోగదారుల నిర్లక్ష్యం కారణంగా రూ.3,49,53,000 బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా నీటి సరఫరా వ్యయం మునిసిపాలిటీకి భారంగా మారింది. అంతేగాక పట్టణాభిృద్ధికి నిధుల కేటాయింపు తగ్గుతోంది. ఈ నేపథ్యంలో బకాయిల వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించేందు కు మునిసిపల్‌ అధికారులు నిర్ణయించారు.


బకాయి చెల్లించకుంటే కనెక్షన్‌ తొలగింపు

నల్లా బిల్లుల బకాయిల వసూలుకు మునిసిపల్‌ అధికారులు మంగళవా రంనుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పట్టణంలో 35 వార్డుల్లో 8,367 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కనెక్షన్ల జాబితా ఆధారంగా బకాయిదారుల వద్దకే నేరుగా మునిసిపల్‌ బృందాలు వెళ్లనున్నాయి. ఒక్కో బృందంలో బిల్‌ కలెక్టర్‌, లైన్‌మెన్‌,పారిశుధ్య సిబ్బంది ఉండనున్నారు. నల్లా కేటగిరీ ఆధారంగా నెలకు రూ.100 నుంచి రూ.1,000 వరకు చార్జీ ఉంది. అయితే బృందాలు వచ్చినప్పు డు బకాయిలు చెల్లించి రశీదు తీసుకోవాలని,లేదంటే నల్లా కనెక్షన్‌ తొలగిస్తామని మునిసిపల్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా బకాయిల వ సూలులో నాయకులు,ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవద్దని కోరుతున్నారు.


బిల్లు చెల్లింపు బాధ్యతగా భావించాలి : బి.నాగిరెడ్డి, భువనగిరి మునిసిపల్‌ కమిషనర్‌

నల్లా బిల్లులు చెల్లింపును పుర పౌరులు బాధ్యతగా భావించాలి. బిల్లులు భారీ మొత్తంలో పేరుకుపోవడం పట్టణాభివృద్ధికి విఘాతంగా మారుతోంది. ఆస్తిపన్నుల మాదిరిగానే నల్లా బిల్లులను కూడా క్రమం తప్పకుండా చెల్లించాలి. బకాయి వసూలుకు వచ్చే సిబ్బందికి సహకరించి రశీదు తప్పక తీసుకోవాలి.


Updated Date - 2022-06-28T06:13:15+05:30 IST