ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక కృషి

ABN , First Publish Date - 2021-06-17T04:36:40+05:30 IST

ఆదివాసీ గ్రామాల అభి వృద్ధికి పోలీసుశాఖద్వారా కృషి చేస్తామని రామ గుండం పోలీస్‌కమిషనర్‌ సత్యనారాయణ అన్నారు.

ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక కృషి
రోడ్డును ప్రారంభిస్తున్న సీపీ సత్యనారాయణ

- రామగుండం సీపీ సత్యనారాయణ

లింగాపూర్‌, జూన్‌ 16: ఆదివాసీ గ్రామాల అభి వృద్ధికి పోలీసుశాఖద్వారా కృషి చేస్తామని రామ గుండం పోలీస్‌కమిషనర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని చోర్‌పల్లి గ్రామపంచా యతీ కేంద్రం నుంచి లెండిగూడ, పూనగూడ వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర పోలీసుశాఖ తరపున నిర్మించిన మట్టిరోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావే శంలో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు సౌకర్యం ఉన్నగ్రామాలే తొందరగా అభివృద్ధి చెందు తాయన్నారు. ఆపద సమయంలో బాధితులను త్వరగా ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్సులు రావాలంటే రోడ్లే ముఖ్యమన్నారు. అందుకోసం మారుమూల ఆదివాసీ గూడాలను గుర్తించి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.ఆదివాసీ యువత కోసం కోచింగ్‌సెంటర్లు, క్రీడాపోటీలు, గ్రంథాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువత కోసం జాబ్‌ మేళా నిర్వహించామన్నారు. యువత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు.

- పిక్లతండా రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తాం..

పిక్లతండా నుంచి కవ్వాలవరకు రోడ్డు వేయించా లని గ్రామస్థులు వినతిప్రతం అందజేశారు. స్పందించిన ఆయన కవ్వాల్‌ రోడ్డు కోసం ప్రయత్నం చేస్తామని హామీఇచ్చారు. లింగాపూర్‌, సిర్పూర్‌ (యూ), జైనూర్‌ మండలాల పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఇక ముందు కూడా దత్తత తీసుకొని ఆదివాసీ గ్రామాలను అభి వృద్ధి చేయాలని సూచించారు. 

- గోండి భాష మాట్లాడి ఆకట్టుకున్న సీపీ..

కార్యక్రమం ప్రారంభంలో రామగుండం సీపీ సత్య నారాయణ ఆదివాసీలను ఉద్దేశించి గోండి భాషలో సమ్దిర్క్‌ రాంరాం(అందరికి నమస్కారాలు) అంటూ ఉపాన్యాసాన్ని మొదలు పెట్డంతో సభికులు ఒక్క సారిగా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు.  కమి షనర్‌ నోటి నుంచి గోండి మాట వినగానే అందరి ముఖాల్లో సంతోషం వ్యక్తమైంది. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ(అడ్మిన్‌) వైవీఎస్‌ సుదీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు, ఓఎస్‌డీ ఉదయ్‌కుమార్‌, కాగజ్‌నగర్‌ ఏఎస్పీ బాలస్వామి, సీఐ హనోక్‌, ఎస్సైలు విష్ణువర్ధన్‌, తిరుపతి, మధుసుదన్‌, రామారావు, గ్రంథాలయ చైర్మన్‌ యాదవ్‌రావు, జైనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంతరావు, సర్పంచ్‌ మనోహర్‌, పోలీసు సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T04:36:40+05:30 IST