పాడిరైతుల అభివృద్ధికి ప్రత్యేక కృషి

ABN , First Publish Date - 2021-03-06T05:23:56+05:30 IST

రాష్ట్రంలో పాడి రైతుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని పాల ఉత్పత్తులు పెంచి వాటి పదార్థాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు.

పాడిరైతుల అభివృద్ధికి ప్రత్యేక కృషి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న లోక భూమారెడ్డి

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి 5: రాష్ట్రంలో పాడి రైతుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని పాల ఉత్పత్తులు పెంచి వాటి పదార్థాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో గోపాలమిత్రలు, పాల వెడ్స్‌, క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన లోకభూమారెడ్డి మాట్లాడుతూ పాల ఉత్పత్తిని పెంచేందుకు పాడి రైతులు కృషి చేయాలన్నారు. గతంలోనూ గోపాలమిత్రలతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం పాడి రైతులకు 4శాతం ఇన్సెంటివ్‌ ఇస్తున్నామని తెలిపారు. రైతులు విజయ డెయిరీకి తమ పాల ఉత్పత్తులను పెంచి మరిన్ని లాభాలను పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ఇందులో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రంగారావు, పాల కేంద్రం డీడీ మధుసూదన్‌రావ్‌, డీఆర్డీఏ ఈడీ గోపికిషన్‌, ఏడీ రామారావ్‌, గోపాలమిత్రలు, క్షేత్ర స్థాయి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:23:56+05:30 IST