నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-08-10T04:21:43+05:30 IST

మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కర్నూలు రేంజ్‌ డీఐజీ ఎస్‌.సెంథిల్‌కుమార్‌ తెలిపారు.

నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి
నందలూరు పోలీ్‌సస్టేషన్‌ను తనిఖీ చేస్తున్న డీఐజీ సెంథిల్‌కుమార్‌, చిత్రంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌కుమార్‌ 


నందలూరు / ఒంటిమిట్ట, ఆగస్టు 9: మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కర్నూలు రేంజ్‌ డీఐజీ ఎస్‌.సెంథిల్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి నందలూరు పోలీ్‌సస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పోలీ్‌సస్టేషన్‌లో కేసులు నమోదు ఎలా ఉంది ఏ విధంగా విచారించి కేసులు నమోదు చేస్తున్నారు, పోలీసు సిబ్బంది పనితీరు ఎలా ఉంది అన్న విషయాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని, అందులో భాగంగా నందలూరు పోలీ్‌సస్టేషన్‌ను తనిఖీ చేశామని తెలిపారు. ఈ స్టేషన్‌ పరిధిలో ఎర్రచందనం కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, సిద్దవటం అటవీ ప్రాంతం నుంచి నందలూరు వరకు ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని, దీనిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. నందలూరు పోలీ్‌సస్టేషన్‌ జాతీయ రహదారికి పక్కగానే ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చామన్నారు. మహిళల కేసులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్‌, డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, సీఐలు పుల్లయ్య, రాజేంద్రప్రసాద్‌, ఎస్‌ఐలు మైనుద్దీన్‌, భక్తవత్సలం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


ఎర్రచందనం రవాణాపై ప్రత్యేక నిఘా

ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఒంటిమిట్ట పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం సర్కిల్‌ పరిధిలోని రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులు, హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మహిళల మిస్సింగ్‌, ఎర్రచందనం రవాణా కేసులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, వీటితో పాటు ఎర్రచందనం, మహిళల రక్షణ, దొంగతనాలు వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌, కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ రాజాప్రభాకర్‌, ఎస్‌ఐ సంజీవరాయుడు, సిద్దవటం ఎస్‌ఐ నాగతులసి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T04:21:43+05:30 IST