రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-09-23T05:03:21+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
మాట్లాడుతున్న ఎస్పీ వకూల్‌ జిందాల్‌

ఎస్పీ వకుల్‌ జిందాల్‌

అద్దంకి పోలీస్‌స్టేషన్‌  తనిఖీ 

అద్దంకిటౌన్‌, సెప్టెంబరు 22: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. గురువారం వార్షిక తనిఖీలో భాగంగా అ ద్దంకి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధి లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలను గుర్తిస్తు న్నామన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌ లుగా గుర్తించి అక్కడ అవసరమైన బోర్డులను ఏర్పాటుచేస్తున్నట్టు చె ప్పారు. ప్రతి శనివారం ప్రమాదరహిత వారంగా పాటిస్తున్నా మన్నా రు. గతంలో కంటే ప్రమాదాల సంఖ్య కొంత తగ్గినట్లు తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తు న్న ట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ చెప్పారు. అసాంఘిక కా ర్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా చర్యలు తీ సుకుంటామన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని బల్లికురవ, సంతమాగులూరుతో పాటు అద్దంకి ప ట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నామన్నా రు. అద్దంకిలో వృద్ధ దంపతులపై జరిగిన దాడిపై ఎస్పీ మాట్లాడుతూ వివిధ కోణాలలో దర్యప్తు జరు పుతున్నామన్నారు. దాడి చేసిన వారికి కచ్చితంగా పట్టుకుంటామ న్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్‌స్టేషన్‌ల స్థాయి ని పెంచామని, కొంత సిబ్బంది కొరత ఉందన్నారు. రాత్రి వేళల్లో గస్తీ ని మరింత పెంచినట్లు చెప్పారు. మసాజ్‌ సెంటర్లు నిబంధనల ప్రకా రం నిర్వహించుకుంటే ఇబ్బంది లేదన్నారు. అసాంఘిక కార్యకలపాలు నిర్వహిస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు. 


Updated Date - 2022-09-23T05:03:21+05:30 IST