స్థానిక సంస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Jun 17 2021 @ 00:54AM
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జగిత్యాల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్థాని క సంస్థల అభివృర్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎ ర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం పల్లెప్రగతి, పట్టణప్రగతి, సీజనల్‌ వ్యాధుల నివారణ, ధరణి, వ్యా క్సినేషన్‌ తదితర అంశాలపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో  వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. పల్లె ప్రగతి ప్రారంభమై సుమారు ఏడాదిన్నర కావస్తోందని ఇప్పటివరకు అధికా రులు, ప్రజాప్రతినిధులు కష్టపడి చక్కని ఫలితాలు సా ధించారన్నారు. అదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగించి లక్ష్యం నెరవేర్చాలని తెలిపారు. గ్రామాల్లో ప్రధానంగా పచ్చదనం, పరిశుభ్రతలపై దృష్టి సారించాలన్నారు. హ రితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ చాలా కీలకమని తెలిపారు. 85 శాతంపైగా మొక్కలు బతికేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యమం త్రి కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీలు చేస్తారని, నిర్లక్ష్యం వహిం చే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశుభ్ర తలో భాగంగా చాలా చోట్ల చెత్త సేకరణ రోజువారీ జర గడం లేదని తెలుస్తోందన్నారు. గ్రామసభలకు ఎంపీ వోలు, డీపీఓలు, అడిషనల్‌ కలెక్టర్లకు హాజరుకావాలని సూచించారు. వానాకాలంలో వాడకం లేని బోర్‌ బావు లు, పాడుబడ్డ బావులు ఒక్కటి కూడా గ్రామాల్లో ఉండ డానికి వీల్లేదని ఆదేశించారు. వచ్చే రెండు రోజుల్లో ప్ర మాదకర బావులు, పాడుబడ్డ బావులు పూడ్చివేయాల ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, పలువురు జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Follow Us on: