ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు ప్రత్యేక హాలిడే

ABN , First Publish Date - 2022-01-03T02:03:42+05:30 IST

ప్రభుత్వోద్యోగులకు అసోం ప్రభుత్వం కొత్త సంవత్సరం మొదట్లోనే చల్లటి కబురు..

ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు ప్రత్యేక హాలిడే

గువాహటి: ప్రభుత్వోద్యోగులకు అసోం ప్రభుత్వం కొత్త సంవత్సరం మొదట్లోనే చల్లటి కబురు చెప్పింది. రెండు రోజులు స్పెషల్ హాలిడే ప్రకటించింది. ఉద్యోగుల కోసం ఈనెల 6,7 తేదీలను ప్రత్యేక హాలిడేగా డిక్లేర్ చేసినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. ''మీ విలువైన సమయాన్ని మీ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో గడపండి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని నవ భారత్, నవ అసోం నిర్మాణానికి పునరంకితం కండి'' అని ఆయన ఒక ట్వీట్‌లో ఉద్యోగులను కోరారు.

Updated Date - 2022-01-03T02:03:42+05:30 IST