బాలికల రక్షణకు ప్రత్యేక చట్టాలు

ABN , First Publish Date - 2021-03-07T04:52:08+05:30 IST

బాలికలు, మహిళలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చాయని సఖీ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ సుజాతరాజ్‌ అన్నారు.

బాలికల రక్షణకు ప్రత్యేక చట్టాలు
సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని జడ్పీహెచ్‌ఎ్‌సలో బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

సఖీ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ సుజాతరాజ్‌

పలు ప్రాంతాల్లో మహిళా దినోత్సవం

సంగారెడ్డి రూరల్‌, మార్చి 6 : బాలికలు, మహిళలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చాయని సఖీ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ సుజాతరాజ్‌ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎ్‌స)లో శనివారం బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం కౌన్సిల్‌ సభ్యులు కల్పన, భానుప్రియ, ప్రధానోపాధ్యాయుడు జాకీర్‌హుస్సేన్‌, ఉపాధ్యాయులు మదన్‌గోపాల్‌, గోవర్ధిని, ప్రవీణ, లావణ్య, సునీత, పున్యానాయక్‌, సత్యనారాయణ, నయీమ్‌, నాగేశం, దివ్య పాల్గొన్నారు.

సంగారెడ్డి అర్బన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మహిళా సదస్సు నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రశాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, జిల్లా అఽధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మయ్యయాదవ్‌, సోమశేఖర్‌, హెచ్‌ఎం విశ్వనాథంగుప్తా పాల్గొన్నారు. 

జోగిపేట: మహిళా అక్షరాస్యతతో సమాజంలో పెనుమార్పు వస్తుందని జోగిపేట మున్సిఫ్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ అసిస్టెంట్‌ జడ్జి సంపత్‌ చెల్లూరి సూచించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందోలులోని కేజీబీవీ పాఠశాలలో న్యాయసాక్షరతా శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జోగిపేట సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ వెంకటరాజాగౌడ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరినారాయణవర్మ, న్యాయవాదులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

జహీరాబాద్‌ : సమాజంలోని ప్రతీ మహిళ విద్య నేర్చుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి పేర్కొన్నారు. శనివారం జహీరాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళాదినోత్సవాన్ని నిర్వహించారు. ఆమె, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రముఖర్జీ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళ పాత్ర అమోఘమన్నారు. 

Updated Date - 2021-03-07T04:52:08+05:30 IST