ఎంపీకి వినతి పత్రం అందజేస్తున్న జుగునాక దేవరావ్, వెంకటేశ్వర్‌రావ్
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్
జైనూరు, మే 21: మండలంలోని మార్లవాయి గ్రామపంచాయతీని అన్నివిధాలుగా అభివృద్ధి పర్చేం దుకు చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. ఈ మేరకు శనివారం మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ, మాజీ ఎంపీటీసీ జుగునాక దేవరావ్, డార్ఫ్ యువజన సంఘం నాయ కులు కనకవెంకటేశ్వర్‌రావు ఎంపీసోయం బాపూరావ్ ను మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం పట్ల ఎంపీ సోయం బాపూరావ్‌తో పుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామపంచాయతీలో యువతీ యువకులు డిగ్రీ, పీజీలు చేసి ఖాళీగా ఉంటున్నారని వారికి ఉద్యోగఉపాధి ఆవకా శాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా రైతుల పంటపొలాలకు సాగు నీరందించా లని సూచించారు. విద్య, వైద్యం, తాగు నీటి సదుపాయం,రోడ్లు,విద్యుత్ వంటి మౌలిక సదుపాయా లు కల్పించాలని కోరారు. ఈసందర్భంగా ఎంపీ సోయం బాపూరావ్ స్పందించి మార్లవాయిని అభివృద్ధి పర్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు.