వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2021-04-18T04:59:03+05:30 IST

రీశైలంలో వారసత్వ ప్రాముఖ్యత ఉన్న కట్టడాలు, గుండాలు, దిగుడుబావులు, చారిత్రక శాస నాలు మొదలైనవాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు.

వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

 ఈవో కేఎస్‌ రామరావు

శ్రీశైలం, ఏప్రీల్‌ 17:
శ్రీశైలంలో వారసత్వ ప్రాముఖ్యత ఉన్న  కట్టడాలు, గుండాలు, దిగుడుబావులు, చారిత్రక శాస నాలు మొదలైనవాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు. ఇప్పటికే పంచమఠాల జీర్ణోద్ధరణ  పనులు చేపట్టినట్లు తెలిపారు.   ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలుగకుండా పునఃనిర్మాణ పనులు జరుగుతు న్నాయని తెలిపారు. అదేవిధంగా పంచమఠాలను ఒకేసారి దర్శించుకు నేందుకు వీలుగా ఒక దారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇటీవల ఆలయ ప్రాంగణంలోని దక్షిణభాగాన దీప స్తంభాన్ని పునరుద్ధరిం చామన్నారు. ఇటీవల విభూతిమఠం, రుద్రాక్షమఠం పాంతంలోని బండపరుపుపై పురాన చిత్రలిపి గల శాసనాలు గుర్తించామన్నారు. శ్రీశైల క్షేత్రంలో ప్రాచీన కట్ట డాలను, శాసనాలను మొదలైనవాటి   పరిరక్షణలో భాగంగా క్షేత్ర పరిధిలో మట్టి, రాళ్ళ తవ్వకాలను నిషేధించామని ఈవో తెలిపారు. ఎవరైనా క్షేత్రపరిధిలో తవ్వకాలు జరిపితే దేవదాయ చట్టం ప్రకారం 30-1987 ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   


Updated Date - 2021-04-18T04:59:03+05:30 IST