Aryan Khan కేసు దర్యాప్తునకు ముంబైకు చేరిన ఎన్సీబీ ప్రత్యేక బృందం

ABN , First Publish Date - 2021-11-06T15:51:17+05:30 IST

ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసును టేకోవర్ చేసేందుకు ప్రత్యేక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బృందం శనివారం ముంబైకి చేరుకుంది...

Aryan Khan కేసు దర్యాప్తునకు ముంబైకు చేరిన ఎన్సీబీ ప్రత్యేక బృందం

ముంబై: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసును టేకోవర్ చేసేందుకు ప్రత్యేక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బృందం శనివారం ముంబైకి చేరుకుంది.ఢిల్లీలోని ఎన్సీబీ హెడ్ క్వార్టర్స్ కు చెందిన అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆర్యన్ ఖాన్ కేసుతో పాటు మొత్తం 6 కేసుల దర్యాప్తును తీసుకుంది. సిట్ కు 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సిట్ బృందం డ్రగ్స్ కేసుల పత్రాలను స్వాధీనం చేసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. 


ఈ కేసులో అవసరమైతే కొంతమంది వ్యక్తుల వాంగ్మూలాలను తిరిగి నమోదు చేయవచ్చని సమాచారం.మరోవైపు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో విధానపరమైన లోపాలు, అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఎన్‌సీబీ విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. సమీర్ వాంఖడే, కనీసం ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో సహా కొంతమంది ఎన్‌సీబీ అధికారుల స్టేట్‌మెంట్‌లను విజిలెన్స్ బృందం రికార్డ్ చేసింది. 


Updated Date - 2021-11-06T15:51:17+05:30 IST