Advertisement

'లవ్‌స్టోరి'తో సాయిపల్లవి మళ్ళీ రైజ్‌

Mar 8 2021 @ 12:12PM

సాయి పల్లవి…ఈ పేరిప్పడు సినిమా పరిశ్రమలోగానీ, అటు పబ్లిక్‌లో గానీ ఎక్కువగా వినిపిస్తున్న మాట. 'ఫిదా' సినిమాలో భానుమతి పాత్ర ద్వారా, తెలంగాణ యాసతో తనే స్వయంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకుని అన్ని వర్గాల ప్రేక్షకులనీ మెప్పించగలిగింది. ఆ సినిమా హిట్ అవడానికి భానుమతి పాత్రను సాయి పల్లవి అంత బాగా రక్తి కట్టించడమే ప్రధాన కారణం. సినిమా ఇండస్ట్రీలో ఓ పాపులర్‌ మాట…డాక్టర్‌నవ్వాలకుని యాక్టర్‌ అయ్యాను….అని. ఈ మాట నిజంగా పల్లవి విషయంలో నిజంగా నిజం. జార్జియాలో మెడిపిన్ చదివి డాక్టర్‌ డిగ్రీ పుచ్చుకున్న స్పెషాల్టీ ఆ అమ్మాయిది. అక్కడ మెడిసిన్ చదువుతూనే కెరీర్‌లో ఫస్ట్ పిక్చర్‌ మళయాళ `ప్రేమమ్‌`లో 2014లో హాలీడే్‌స్‌ని పురస్కరించుకుని యాక్ట్ చేసింది. తర్వాత సినిమా 'కలి'లో కూడా ఓ నెల చదువు నుంచి శెలవు తీసుకుని మరీ నటించింది. తెరపైకి వస్తూనే అవార్డులు గెలుచుకుని మంచి నటిగా గుర్తింపు సాధించడంతో సాయి పల్లవి స్థానం సినిమా పరిశ్రమలో సుస్థిరమైపోయింది. డాన్స్‌పైన అమితమైన మక్కువతో ప్రోగ్రామ్స్‌లో డాన్స్‌లు చేస్తూ అందరి దృష్టని ఆకర్షించిన సాయిపల్లవి చిన్నతనంలోనే 'కస్తూరిమన్‌, ధామ్‌ ధామ్‌' చిత్రాలలో చిన్నచిన్నపాత్రలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు తల్లి సహకారం కూడా తోడైంది. చెప్పడానికి సాయిపల్లవి కెరీర్‌ ఇప్పటికి చిన్నదే అయినా, అందులోనే ఆమెకే సొంతమైన కొన్ని ప్రత్యేకతలున్నాయి. 

 

తమిళంలో సాయిపల్లవి చేసిన 'మారి 2'లో ఆమె మీద షూట్‌ చేసిన 'రౌడీబేబీ..' సాంగ్‌ ఇండియాలోనే యూట్యూబ్‌లో హయ్యస్ట్ వ్యూస్‌ వచ్చిన సాంగ్‌. ఇప్పడింక 'లవ్‌స్టోరి' సినిమాలో 'సారంగ దరియా..' పాట సృష్టించిన సంచలనం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. 'లవ్‌స్టోరి'లో కూడా తెలంగాణ పిల్లగానే కనిపించబోతున్న సాయిపల్లవి ఈ సినిమా తర్వాత తెలంగాణ సినిమాకి బ్రాండ్‌ అంబాస్డర్ కావడం ఖాయం. ఈ పాట, అందులో కనిపించే సాయిపల్లవి….ఈ రెండు చాలు లవ్‌స్టోరీ కూడా ఫిదా లాగే చరిత్ర సృష్టించడం తథ్యం అంటున్నారు సినీపండితులు. సాయి పల్లవి గురించి కొత్త పాత్రలు పుట్టుకొస్తున్నాయి. రచయితలు సాయిపల్లవి చిత్రాలు రాయడానికి ఉబలాటపడుతున్నారు. అయితే, సాయిపల్లవి రెమ్యునరేషన్‌ కోసమో, మాస్ పాపులారిటీ కోసమో సినిమాల మీద సినిమాలు ఒప్పుకునే టైపు కాదు.  తనకే నచ్చాలన్న గర్వం కూడా లేదు. కాకపోతే…దర్శకుడు తన క్యారెక్టర్‌ని ఏ విధంగా ప్రెజంట్ చేస్తాడన్న విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడుతుంది సాయిపల్లవి. అందుకే ఎక్కువ సినిమాలు చెయ్యదు. అలాగని సాయిపల్లవి చేసిన సినిమాలన్నీ ఫిదాలా హిట్ అయిపోయాయా అంటే పడిపడి లేచే మనసు లాటి డిజాస్టర్ కూడా ఉంది ఆమె ఖాతాలో. ఇటువంటి ఫ్లాఫ్‌లో కూడా సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంది. అదొక రికార్డు. సినిమా ఫ్లాఫ్ అయిందని, నిర్మాతని సపోర్ట్ చేస్తూ, తీసుకున్న రెమ్యూనరేషన్‌లో సగం తిరిగిచ్చేసింది సాయి. ఎంత గొప్ప మనసు. ఇటువంటి హీరోయిన్‌ని తెలుగుసినీ పరిశ్రమ ఇంతవరకూ చూడలేదంటే అతిశయోక్తి కానేకాదు. ఇప్పుడు లవ్‌స్టోరీ వస్తోందంటే నాగచైతన్య సినిమాగా ఎంత గుర్తింపుందో, పుస్కూరు రామ్మోహనరావు, సునీల్‌నారంగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాగా ట్రేడ్‌లో ఎంత క్రేజ్‌ ఉందో, శేఖర్‌ కమ్ముల డైరెక్టర్‌ అని ఎంత ఫాలోయింగ్‌ ఉందో….సాయిపల్లవి హీరోయిన్‌ అన్న రేంజ్‌ కూడా అంతే ఉండడం సాయిపల్లవి ఇంత చిన్న కెరీర్‌ సాధించిన ఘనత చెప్పడం ముఖ్యం. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.