దేవరగట్టులో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-11-29T05:20:42+05:30 IST

దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పూజారి మల్లికార్జునస్వామి తెలిపారు.

దేవరగట్టులో ప్రత్యేక పూజలు

హొళగుంద, నవంబరు 28: దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పూజారి మల్లికార్జునస్వామి తెలిపారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలైన జలాభిషేకం, రుద్రాభిషేకం, మహామంగళహారతితోపాటు ఆకు పూజ నిర్వహించినట్లు తెలిపారు. చుట్టు పక్క గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

Updated Date - 2021-11-29T05:20:42+05:30 IST