కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-08-08T05:57:33+05:30 IST

: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మహాలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు

కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
విశేష అలంకరణలో అమ్మవారు

మహారాణిపేట, ఆగస్టు 7: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మహాలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆలయానికి  భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన కె.వరలక్ష్మి  కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి లక్ష రూపాయలను విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ సహాయ కార్యనిర్వాహక అధికారి వెంపల్లి రాంబాబుకు అందించారు. 


Updated Date - 2022-08-08T05:57:33+05:30 IST