Advertisement

నిధి సమర్పణకు విశేష స్పందన

Jan 25 2021 @ 00:20AM
కల్హేర్‌ మండలంలోని మార్డి గ్రామంలో బైకు ర్యాలీ నిర్వహిస్తున్న యువకులు

రామదండులా కదులుతున్న యువత

సదాశివపేటలో రూ. 2.67 లక్షలు ఇచ్చిన నాయకులు

సదాశివపేట, జనవరి 24: అయోధ్యలో రామమందిర నిధి సమర్పణకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తున్నది.  ప్రతీ ఒక్కరు తమవంతుగా భాగస్వాములవుతున్నారు. సదాశివపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లోడి జయమ్మ రూ.1 లక్ష 51వేలు, 12వ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి రాజు దంపతులు రూ. 1 లక్ష 16 వేల చెక్కులను ఆదివారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బాధ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి మమత, మాధవి, మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నల్లవల్లి ఎంపీటీసీ రూ. 25 వేలు

గుమ్మడిదల, జనవరి 24: మండలంలోని పలు గ్రామాల్లో రామ  మందిర నిధి సమర్పణ నిర్వహిస్తున్నారు. గుమ్మడిదలలో ఆర్‌ఎ్‌సఎస్‌ బాధ్యులు ఆదివారం గడపగడపకు వెళ్లి నిధి సేకరించారు. నల్లవల్లి ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి రూ. 25 వేల చెక్కును ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రచారక్‌ సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సూర్యనారయణ, రైతు సంఘం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఆర్‌ఎ్‌సఎస్‌ మండల ప్రచారక్‌  శ్రీకాంత్‌, మల్లారెడ్డి, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పదిహేను గ్రామాల్లో శోభాయాత్ర

కల్హేర్‌, జనవరి 24: మండలంలోని 15 గ్రామాల్లో ఆదివారం రామాలయ నిర్మాణ నిధి సేకరణ శోభాయాత్ర నిర్వహించారు. కొండాపూర్‌, అంతర్గామ, ఇరక్‌పల్లి ఆశ్రమ పీఠాధిపతులు సంగ్రామ్‌ మహరాజ్‌, కరణ్‌ మహరాజ్‌, దేవీదాస్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో నాగ్‌ధర్‌, రాంచందర్‌ తండా, బాచేపల్లి, మీర్‌ఖాన్‌పేట్‌, రాపర్తి, కృష్ణాపూర్‌, ఖానాపూర్‌, జంలాతండా, బీబీపేట్‌, మార్డి, ఇందిరానగర్‌ కల్హేర్‌, మాసాన్‌పల్లి, మహదేవ్‌పల్లి తదితర గ్రామాల్లో నిధి సేకరణ చేపట్టారు. అనంతరం కల్హేర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పీఠాధిపతులు మాట్లాడుతూ రామాలయ నిర్మాణంలో పేద, ధనిక బేధం లేకుండా ప్రతీఒక్కరిని భాగస్వాములను చేసేందుకే నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు.

ప్రతీ ఇంటి నిధి సమర్పణ

వట్‌పల్లి, జనవరి 24: అయోధ్యలో నిర్మించనున్న రామమందిర నిర్మాణం కోసం సేకరిస్తున్న నిధికి మండలంలో అనూహ్య స్పందన వస్తున్నదని ట్రస్టు సభ్యులు చంద్రశేఖర్‌, విజయ్‌కుమార్‌, కృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్‌ఐ దశరథ్‌ ఆలయ నిర్మాణం కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఖాదిరాబాద్‌లోనూ ప్రజలు విరాళాలు అందజేశారని తెలిపారు. 

ఝరాసంగం : ఝరాసంగం మండలంలోని మేదపల్లి, బర్దీపూర్‌, కక్కర్‌వాడ గ్రామాల్లో ఆదివారం విరాళాల సేకరణ చేపట్టారు. మేదపల్లిలో రూ.11,111 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పరమేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

హత్నూర : మండల కేంద్రమైన హత్నూరలో ఆదివారం రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పండుగ రవికుమార్‌, నరేందర్‌, ప్రశాంత్‌, ప్రవీణ్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement