గిరిజనానికి.. వైద్యబాటలు.. అత్యవసర వేళ నేనున్నానంటున్న డాక్టర్‌ సంధ్యారాణి

ABN , First Publish Date - 2021-07-23T04:39:09+05:30 IST

వృత్తిని దైవంగా భావిస్తూ తన ప్రాణాలనే పణంగా పెట్టి పేదలకు వైద్యసేవలందిస్తోంది ఆ వైద్యురాలు.. వృత్తికి న్యాయం చేయలనే తపనతో ఎంతటి కష్టమైనా వాగులు వంకలు దాటి, మైళ్ల దైరం నడిచి మారు మూల పల్లెల్లోనూ వైద్యసేవ లందిస్తోంది డాక్టర్‌ సంధ్యారాణి..

గిరిజనానికి.. వైద్యబాటలు.. అత్యవసర వేళ నేనున్నానంటున్న డాక్టర్‌ సంధ్యారాణి
బాటన్న నగర్‌లో హెల్త్‌ క్యాంపులో సంధ్యారాణి

వృత్తే దైవం.. సేవే మార్గంగా పయనం

వాగులు, వంకలు దాటి పల్లెల్లో వైద్యశిబిరాలు

ఆళ్లపల్లి, జూలై 22: వృత్తిని దైవంగా భావిస్తూ తన ప్రాణాలనే పణంగా పెట్టి పేదలకు వైద్యసేవలందిస్తోంది ఆ వైద్యురాలు.. వృత్తికి న్యాయం చేయలనే తపనతో ఎంతటి కష్టమైనా వాగులు వంకలు దాటి, మైళ్ల దైరం నడిచి మారు మూల పల్లెల్లోనూ వైద్యసేవ లందిస్తోంది డాక్టర్‌ సంధ్యారాణి.. భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఏజెన్సీ మండలమైన ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మూడు సంవత్సరాలుగా వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ సంధ్యారాణి ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలనే సంకల్పంతో గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే మండలంలోని కొన్ని ఆదివాసీ గూడేలకు కనీసం రహదారి సౌకర్యం కూడా లేదు. వర్షాకాలం వచ్చిందంటే సీజనల్‌ వ్యాధులతో బాధపడే మన్యం ప్రజలు పొంగుతున్న వాగులు దాటివచ్చి వైద్యం చేయించుకోలేక మంచానికే పరిమితమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధులనుంచి గిరిజనులను రక్షించాలనే ధృడ సంకల్పంతో గిరిజనగూడాలకు వైద్యబాటలు వేశారు డాక్టర్‌ సంధ్యారాణి.. మండల ంలోని బూసురాయి, అడవిరామవరం, సింగారం, రాయిగూడెం, చంద్రాపురం, పాతూరు, కర్నెగూడెం, బోడాయికుంటా గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేకపోగా వాగులు అడ్డుగా ఉన్నాయి. వర్షాకాలంలో ఈ వాగులు పొంగి ప్రవహిస్తుంటాయి. కానీ వాటిని కూడా లెక్క చేయకుండా డాక్టర్‌ సంధ్యారాణి పల్లెలకు చేరుకొని గొత్తి కోయ గిరిజనులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆళ్లపల్లి పీహెచ్‌సీ పేరుకు 12గంటల ఆసుపత్రి అయినా 24 గంటల ఆసుపత్రిలో అందు బాటులో ఉంటా రు. తనకు తోడుగా మరి కొందరు నర్సుల సహాయం తీసుకొని వారిని ప్రోత్సహించి ప్రణా ళికా బద్దంగా ప్రతి పల్లెలో వైద్య శిభిరాలు నిర్వహి స్తారు. ఏ సమయం లోనైనా అత్యవసర సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందు తున్నారు. ఆళ్లపల్లి మండల ంలో డాక్టర్‌ సంధ్యారాణి అంటే తెలియనివారుండరు. ఆమె సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.



Updated Date - 2021-07-23T04:39:09+05:30 IST