ఈ పక్షి సముద్రపు దొంగలను పట్టిస్తుందట..!

ABN , First Publish Date - 2020-09-21T23:46:25+05:30 IST

ఇదొక అద్భుతమైన పక్షి. దీని శక్తి నమ్మడానికి, ఊహించడానికి వీలు లేకుండా ఉంటుంది. గాలిలో ఎక్కువ సేపు ఎగరడంలో..

ఈ పక్షి సముద్రపు దొంగలను పట్టిస్తుందట..!

ఇదొక అద్భుతమైన పక్షి. దీని శక్తి నమ్మడానికి, ఊహించడానికి వీలు లేకుండా ఉంటుంది. గాలిలో ఎక్కువ సేపు ఎగరడంలో ఇది దిట్ట. భూమి మీద వాలకుండా నెల రోజుల్లో 10 వేల కిలో మీటర్లు  ప్రయాణించినా అలసిపోదు. తన జీవిత కాలంలో ఇది దాదాపు 85 లక్షల కిలో మీటర్ల దూరం ఎగురుతూ ప్రయాణిస్తుంది. అంటే పది సార్లు చంద్రుడిపైకి వెనక్కి వచ్చినంత దూరం. మూడు మీటర్ల పొడవైన దాని రెక్కలు అద్భుతమైన శక్తిని ఇస్తాయి. ఇది ఒక విమానంలా సముద్రాన్ని చుట్టేయగలదు. ప్రత్యేకమైన సముద్రపు పక్షి. ఇది ఒక కొత్త బాధ్యతను కూడా నిర్వహించబోతోంది.


కేవలం సముద్రంలో చేపలను వేటాడటంలోనే కాదు. సముద్రపు దొంగలను అధికారులకు పట్టించడంలో కూడా ఆల్బట్ రోస్ సహాయపడుతుంది. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి మత్య్సకారులు వలలు వేస్తారు. అయితే వలల్లో చేపలే కాకుండా అనేక పక్షులు, సముద్రజీవులు కూడా చిక్కుకుని మరణిస్తూ ఉంటాయి. దీనినే బై కాచింగ్ అంటారు. ఈ బై కాచింగ్ కారణంగా ఏటా కొన్ని వేల పక్షులు, సముద్రజీవులు చనిపోతున్నాయి. 

Updated Date - 2020-09-21T23:46:25+05:30 IST