రేషన్‌ పంపిణీ పై ప్రత్యేక పర్యవేక్షణ

ABN , First Publish Date - 2022-01-26T05:42:06+05:30 IST

రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపడతామని తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ తెలిపారు.

రేషన్‌ పంపిణీ పై ప్రత్యేక పర్యవేక్షణ
మాట్లాడుతున్న తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌

 పక్కదారి పట్టిస్తే జైలుకే -తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌

ప్రొద్దుటూరు అర్బన్‌ జనవరి 25 : రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపడతామని తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. మంగళవారం తహసీల్దాకు కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దారు కిశోర్‌రెడ్డి అధ్యక్షతన రేషన్‌ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యం వల్ల సమస్య వస్తోందన్నారు. వీటిని ఎండీయూలు పంపిణీ చేయకండి డీలర్లే పంపిణీ చేయాలన్నారు. డీలరు స్టాక్‌ తీసుకున్నప్పుడు దాన్ని రేషన్‌ షాపునకు తరలించేటప్పుడు కచ్చితమైన నిబంధనలు పాటించాలన్నారు.  సమావేశంలో డీటీ వరదకిశోర్‌రెడ్డి, ఆర్‌ఐ స్వామి తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-01-26T05:42:06+05:30 IST