summerకి ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-05-15T20:55:32+05:30 IST

సవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం వేర్వేరు మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

summerకి ప్రత్యేక రైళ్లు

తిరుపతి: వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం వేర్వేరు మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు(07433) 17వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో 6.40 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో ఈ ప్రత్యేక రైలు (07434) 19వ తేదీ రాత్రి 8.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, గూడూరు మీదుగా తిరుపతికి రాకపోకలు సాగిస్తుంది. మరో ప్రత్యేక రైలు (07435) తిరుపతిలో ఈ నెల 18న సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అదేరోజు కాకినాడలో ఈ ప్రత్యేక రైలు(07436) ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6.40 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ రైలు రేణిగుంట, గూడూరు, విజయవాడ, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా కాకినాడకు రాకపోకలు సాగిస్తుంది. 

Updated Date - 2022-05-15T20:55:32+05:30 IST