గుంటూరు మీదగా ఏడు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-09-26T05:04:16+05:30 IST

దసర, దీపావళి పండగల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా ఏడు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నెలాఖరు వరకు నడపనున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి తెలిపారు.

గుంటూరు మీదగా ఏడు ప్రత్యేక రైళ్లు

పండుగల సందర్భంగా అక్టోబరు నెలఖరు వరకు

గుంటూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):  దసర, దీపావళి పండగల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా ఏడు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నెలాఖరు వరకు నడపనున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి  తెలిపారు. నెంబరు. 07637 తిరుపతి - ఔరంగబాద్‌ ప్రత్యేక రైలు అక్టోబరులో ప్రతీ ఆదివారం ఉదయం ఏడుగంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.10కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఔరంగబాద్‌ చేరుకొంటుంది. నెంబరు.07638 ఔరంగబాద్‌ - తిరుపతి రైలు ప్రతీ సోమవారం రాత్రి 11.05 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు గుంటూరు, అర్ధరాత్రి దాటాక 3 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. నెంబరు.07639 నాందేడ్‌ - తిరుపతి రైలు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.30కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నెంబరు 07640 తిరుపతి - నాందేడ్‌ ప్రత్యేక రైలు ప్రతీ శనివారం రాత్రి 11.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు గుంటూరు, సాయంత్రం 5.50కి నాందేడ్‌ చేరుకుంటుంది. నెంబరు. 07612 కాచీగూడ - నరసపూర్‌ ప్రతీ సోమవారం రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 4.50కి గుంటూరు, ఉదయం 10.30కి నరసపూర్‌ చేరుతుంది. నెంబరు. 07698 విజయవాడ - నాగరసోల్‌ రైలు ప్రతీ శుక్రవారం సాయంత్రం 4.15కి బయలుదేరి 5.15కి గుంటూరు, మరుసటి రోజు మధ్యాహ్నం 2.10కి నాగర్‌సోల్‌ చేరుకుంటుంది. నెంబరు. 07699 నాగర్‌సోల్‌ - విజయవాడ రైలు ప్రతీ శనివారం రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.20కి గుంటూరు, సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుంటుంది. 


రూ.3.77 లక్షల జరిమానాలు 

రైళ్లలో టిక్కెట్‌ తనిఖీల ద్వారా ఒకే రోజున రూ.3 లక్షల 77 వేల 965 జరిమానాగా వసూలు చేసినట్లు డివిజనల్‌ రైల్వే అధికారి ఆదివారం తెలిపారు. మొత్తం 16 మంది ఉద్యోగులతో 14 రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 398 మంది టిక్కెట్‌ రహిత, అసంబద్ధమైన టిక్కెట్లతో ప్రయాణిస్తున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ప్రయాణికులు టిక్కెట్‌ తీసుకునే సంబంధిత రైళ్లలో ప్రయాణించాలన్నారు. జనరల్‌ టిక్కెట్లతో రిజర్వుడ్‌ బోగీల్లోకి ప్రవేశించరాదని చెప్పారు. రైల్వేస్టేషన్లలో బుకింగ్‌ కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.  


Updated Date - 2022-09-26T05:04:16+05:30 IST