కొవిడ్‌ మృతదేహాల అంత్యక్రియలకు ప్రత్యేక వైకుంఠరథం

May 9 2021 @ 00:47AM
ఏర్పాటు చేసిన ప్రత్యేక వైకుంఠరథం

నిర్మల్‌ కల్చరల్‌, మే 8 : కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల నిర్వ హణ కోసం తరలించేందుకు గాను ప్రత్యేక వైకుంఠరథం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ తెలిపారు. శనివారం ఆయన మున్సిపల్‌ కార్యాల యంలో ఈ వాహనాన్ని ప్రారంభించారు. కరోనా మరణాలు సంభవించినప్పుడు ఇబ్బందులు కలుగకుండా ఉండాలని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని సమకూర్చామని అన్నారు. ప్రజలు అధైర్య పడరాదని, అన్ని విధాలుగా అండగా ఉంటామని, కొవిడ్‌జాగ్రత్తలు పాటించాలని, మాస్క్‌లు, భౌతికదూరం పాటిం చాలని కోరారు. ఏఈ వినయ్‌ కుమార్‌, నాయకులు అడపా పోశెట్టి, మేడారపు ప్రదీప్‌, సిరికొండ రమేష్‌ పాల్గొన్నారు. 


Follow Us on: