ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-18T06:09:04+05:30 IST

జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి: కలెక్టర్‌
కేతవరంలో జగనన్న కాలనీని పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఓర్వకల్లు, ఆగస్టు 17: జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధ వారం మండలంలోని కేతవరం గ్రామంలోని జగనన్న కాలనీ లేఅవుట్‌లలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేతవరం గ్రామ జగనన్న కాలనీ లేవుట్లలో 36 ఇళ్లు మంజూరు కాగా, 23 ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, 23 గృహాలు సొంతంగా నిర్మించుకుంటున్నారన్నారు. అనంతరం కేతవరం గ్రామసమీపాన ఉన్న రాతి చిత్రాలను కలెక్టర్‌ గంటపాటు ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. కలె క్టర్‌ మాట్లాడుతూ కేతవరం గ్రామ సమీపాన రాతి చిత్రాలు కలి గిన ప్రాంతం వరకు రోడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ అధికారులు కోరిన విధంగా రెండెకరాల భూమి కేటాయింపునకు సంబంధించి అధికారులు ప్రాసెస్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివ ప్రసాద్‌ రెడ్డి, ఎంపీడీవో శివనాగప్రసాద్‌, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

కర్నూలు(రూరల్‌): కర్నూలు రూరల్‌ మండలంలోని గార్గేయపురం గ్రామంలో జగనన్న కాలనీని కలెక్టర్‌ కోటేశ్వరరావు బుధవారం అకస్మిక తనిఖీ చేశారు. లేఅవుట్లలో జరుగుతున్న నూతన గృహాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా  మొత్తం 121 ఇంటి నిర్మాణాలకు గాను, 91గృహాల నిర్మాణపనులు జరుగుతున్నట్లు హౌ సింగ్‌ ఈఈ కలెక్టర్‌కు వివరించారు. ఆయన వెంట హౌసింగ్‌ ఈఈ, డీఈ, ఏఈ, ఇన్‌చార్జి ఎంపీడీవో భాస్కర్‌ నాయుడు, ఈవోఆర్డీ నాగేశ్వరరెడ్డి, తహసీ ల్దార్‌ వెంకటేష్‌నాయక్‌, టీవీ. రమేష్‌బాబు, నాయకులు యేసేపు పాల్గొన్నారు.

కర్నూలు(కలెక్టరేట్‌):
పెండింగ్‌లో ఉన్న 45 ప్రయారిటీ భవనాల నిర్మా ణాలను వచ్చే వారంలోగా మొదలు పెట్టాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పం చాయతీరాజ్‌ శాఖ ఈఈ, డీఈలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫ రెన్స్‌ హాల్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాల పురోగతి, నాడు-నేడు, హౌసింగ్‌ అంశాలపై సంబం ధిత అఽధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలో 1257 ప్రయారిటీ భవనాలు మంజూరు కాగా, అందులో దేవన కొండ, హాలహర్వి, హోళగుంద, కౌతాళం, మంత్రాలయం, పెద్దకడుబూరు, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు, కర్నూలు, ఓర్వకల్లు, పత్తికొండ, తుగ్గలి, వెల్దుర్తి మండలాల్లో 45 ప్రయారిటీ భవనాల నిర్మాణం మొదలు పెట్టలేదని, వచ్చే వారం నాటికి ఖచ్చితంగా పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. మనబడి నాడు-నేడు పనులకు సంబంధించి 11 పాఠశాలలకు కూడా ఎస్టివే షన్‌  పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, జడ్పీ సీఈవో నాసరరెడ్డి పంచాయతీరాజ్‌ శాఖ ఈఈలు, డీఈలు, హౌసింగ్‌, సమగ్ర శిక్ష, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T06:09:04+05:30 IST