ఓటీఎస్‌ నమోదును వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-11-26T05:07:55+05:30 IST

ఓటీఎ్‌సలో పేర్లు వచ్చిన వారి నుంచి నగదు కట్టించుకొని, వారికి త్వరగా ఇల్లు, స్థలం వారి పేరుతో రిజిస్టర్‌ చేస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ చెప్పారు.

ఓటీఎస్‌ నమోదును వేగవంతం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ చేతన్‌

వైకేపీ సిబ్బందికి జేసీ సూచన

లింగసముద్రం, నవంబరు 25 : ఓటీఎ్‌సలో పేర్లు వచ్చిన వారి నుంచి నగదు కట్టించుకొని, వారికి త్వరగా ఇల్లు, స్థలం వారి పేరుతో రిజిస్టర్‌ చేస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ చెప్పారు. మండలంలోని పెంట్రాల సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది, వలంటీర్ల హాజరు పట్టీలను తనిఖీ చేశారు. వలంటీర్లు అందరూ ప్రతి సోమవారం తప్పనిసరిగా వస్తున్నారా..?, లేదా..? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ఓటీఎ్‌సపై సమీక్షించారు. పెంట్రాల పంచాయతీ పరిధిలో 246 గృహాలు ఓటీఎ్‌సలో రాగా కేవలం 8 మంది మాత్రమే నగదు కట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పొదుపు గ్రూపుల మహిళలు వెలుగు ద్వారా రుణాలు తీసుకొని ఓటీఎస్‌లో నగదు చెల్లించాలన్నారు. అధికారులు, సిబ్బంది, వలంటీర్లు ఈ పథకాన్ని వేగవంతం చేయాలన్నారు.

ముండ్లమూరు : గతంలో ప్రభుత్వ లబ్ధి ద్వారా ఇళ్లు నిర్మించుకున్న వారికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం ద్వారా మేలు జరుగుతుందని వైఎస్‌ఆర్‌ కాంతి పథకం పీడీ బీ.బాబూరావు అన్నారు. గురువారం వైకేపీ మండల కార్యాలయంలో వీవోఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఇంటిపై శాశ్వత హక్కు కల్పిస్తారన్నారు. ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ క్రాంతి పథకం ద్వారా అమలు చేస్తున్న ఆసరా, చేయూత పథకాలను కూడా సద్వినియోగ పరుచు కోవాలన్నారు. అనంతరం మూడు సంఘాలకు రూ 3.50 లక్షల ఏఏఎఫ్‌ చెక్కులను సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు, హౌసింగ్‌ ఏఈ రమణ, ఏపీఎం ఏ సిమోను, సీసీలు మోహనరావు, సుంకర శ్రీనివాసరావు, గురవయ్య, రత్నకుమారి, మండల సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుపతమ్మ, పేరమ్మ పాల్గొన్నారు. 

తాళ్లూరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని డీఆర్‌డీఏ పీడీ బి.బాబూరావు తెలిపారు. తూర్పుగంగవరం సచివాలయం వద్ద పొదుపు మహిళలతో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పఽథకం ప్రాధాన్యత గురించి గురువారం వివరించారు. తాళ్లూరు వైకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం నరేష్‌ ఆద్వర్యంలో పొదుపుసంఘం మహిళలకు అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, హౌసింగ్‌ సిబ్బంది హనుమంతరావు, రవి, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T05:07:55+05:30 IST