స్థలాల మ్యాపింగ్‌ వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-06-17T04:51:22+05:30 IST

జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాల మ్యాపింగ్‌ వేగవంతంచేయాలని గృహ నిర్మాణశాఖ ఈఈ పి.కూర్మినాయుడు కోరారు.

స్థలాల మ్యాపింగ్‌ వేగవంతం చేయండి
పొందూరులో సమీక్షిస్తున్న అధికారులు

 గృహ నిర్మాణశాఖ ఈఈ  కూర్మినాయుడు 

పొందూరు:జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాల మ్యాపింగ్‌ వేగవంతంచేయాలని గృహ నిర్మాణశాఖ ఈఈ పి.కూర్మినాయుడు కోరారు. బుధవారం పొందూరులో సచివాలయ సర్వేయర్లు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి.మురళికృష్ణ  పాల్గొన్నారు. ఫసోంపేట: గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే నిర్మాణాలు పూర్తిచేయాలని ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి కోరారు. బుధవారం సోంపే టలో సచివాలయ సిబ్బందితో భవననిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా సమీక్షించారు. ఫపాలకొండ రూరల్‌: లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించాలని కమిషనర్‌ రామారావు సూచించారు. నగర పంచాయతీలో హౌసింగ్‌ గ్రీవెన్స్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ, ఏఈలు, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఇచ్ఛాపురం రూరల్‌: ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లస్థలాలు ఆక్ర మిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ బి.మురళీమోహనరావు   హెచ్చ రించారు. పాయితారి పంచాయతీకి చెందిన దూప కిరమ్మకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు స్థలంలో మరొకరు పునాదులు వేయడంపై ఫిర్యాదు అందింది. ఈ మేరకు బుధవారం ఆర్‌ఐ శ్రవణకుమార్‌, సర్వేయర్‌ తవిటినాయుడు వెళ్లి పరిశీలించా రు.బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దారు తెలిపారు. ఫ సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో బి.వెంకటరమణ కోరారు. ఇచ్ఛాపు రంలో  కార్యదర్శులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ టి.వాసు పాల్గొన్నారు.  ఫ సీతంపేట:  సచివాలయాలు, ఆర్బీకేల  పనులపై దృష్టి సారించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ డి.మురళి తెలిపారు.  సీతంపేటలో  పంచాయతీరాజ్‌, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈఓపీఆర్‌డీ కె.సత్యం పాల్గొన్నారు.


 



Updated Date - 2021-06-17T04:51:22+05:30 IST