వడివడిగా కండలేరు కాలువ విస్తరణ పనులు

Jun 20 2021 @ 21:00PM
సోమశిల కండలేరు వరద కాలువ.

కలువాయి, జూన్‌ 20 :  సోమశిల కండలేరు వరద కాలువ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కాలువ ప్రస్తుత ప్రవాహ సామర్థ్యం 12 వేల క్యూసెక్కులు. దీంతో సోమశిల నుంచి కండలేరుకు రోజుకు 1 టీఎంసీ మాత్రమే తరలించేందుకు అవకాశం ఉంది. సాధారణంగా సోమశిల జలాశయానకి ప్రతి ఏటా నెల రోజలు మాత్రమే వరద వస్తుంది. ఈ నేపథ్యంలో  కండలేరు కాలువ సామర్థ్యం రెట్టింపు చేస్తే నెల రోజుల్లో కండలేరు జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుంది.  ఈ పనులకు ప్రభుత్వం రూ.928.5కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా, నెల రోజులుగా పనులు జరుగుతున్నాయి.  ఈ పనులు పూర్తైతే అదనంగా 50 వేల ఎకరాలకు నీరు అందించడంతో పాటు చైన్నై, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సమృద్థిగా నీరు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.