స్పీడు పెంచిన ఈపీఎస్‌

ABN , First Publish Date - 2022-06-26T18:27:12+05:30 IST

చెన్నై, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏకనాయకత్వం కోసం జూలై 11వ తేదీన సర్వసభ్యమండలి సమావేశాన్ని సవ్యంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే ఉప

స్పీడు పెంచిన ఈపీఎస్‌

న్యాయనిపుణులు.. సీనియర్‌ నేతలతో మంతనాలు

ఢిల్లీ నుంచి నగరానికి చేరిన ఓపీఎస్‌

ప్రిసీడియం చైర్మన్‌గా తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ బాధ్యతల స్వీకారం

చెన్నై, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏకనాయకత్వం కోసం జూలై 11వ తేదీన సర్వసభ్యమండలి సమావేశాన్ని సవ్యంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే ఉప సమన్యకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) న్యాయనిపుణులతో ముమ్మరంగా మంతనాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి  గ్రీన్‌వే్‌సరోడ్డులోని తన నివాసంలో పార్టీ సీనియర్‌ నేతలు, న్యాయనిపుణులు, పార్టీ న్యాయవిభాగం ప్రతినిధులతో ఎడప్పాడి సమావేశమవుతున్నారు. శనివారం ఉదయం కూడా ఆయన న్యాయనిపుణులతో చర్చించారు.  ఓపీఎస్‌ వర్గీయులు సర్వసభ్యమండలి సమావేశానికి వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. తమ సమాధానం కూడా పరిశీలించాకే తదుపరి చర్యలకు దిగాలంటూ ఈపీఎస్‌ వర్గం కూడా వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమైంది. అదేవిధంగా ఓపీఎస్‌ వర్గం సర్వసభ్యమండలి సమావేశాన్ని, ఏకనాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే నెల 11న మళ్ళీ విచారణ ప్రారంభం కానుంది. ఆలోపున ఈపీఎస్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు బలమైన ఆధారాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కూడా ఈపీఎస్‌ వర్గం సిద్ధమైంది. 

తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ బాధ్యతల స్వీకారం

అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా ఎన్నికైన తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈపీఎస్‌ అనుచరుడిగా ముద్రపడిన ఆయన ముందుగా ఆయన మెరీనాతీరంలోని ఎంజీఆర్‌, జయలలితల స్మారక మందిరాలకు అంజలి ఘటించారు. అదే విధంగా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన అక్కడున్న దివంగత నేతల విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, అన్నాడీఎంకే యువజన విభాగ సంయుక్త కార్యదర్శి, ‘ఉంగలుక్కాగ’ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జయకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీలో ఓపీ ఎ్‌సకు మద్దతిచ్చేవారు ఎవ రూ లేరని ఇటీవలి సర్వసభ్యమండలి సమావేశం ద్వారా రుజువైందని, ఇకపై పార్టీలో కలహాలు సృష్టించడంమానుకోవాలని విజ్ఞప్తి చేశారు. సర్వసభ్యమండలి సమావేశంలో సభ్యులెవరో ఓపీఎ్‌స పై నీటి బాటిల్‌ విసరడం పట్ల ఎడప్పాడి ఆగ్రహం వ్యక్తంచేశారన్నారు. పార్టీలో జరుగుతున్న వివాదంలో బీజేపీ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలో ఓపీఎస్‌ మంతనాలు...

గత బుధవారం జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఘోరపరాభవాన్ని చవిచూసిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఓపీఎస్‌.. సర్వసభ్యమండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఢిల్లీ వెళ్ళిన పన్నీర్‌సెల్వం అక్కడి న్యాయనిపుణులతో చర్చించారు. అనంతరం శనివారం సాయంత్రం నగరానికి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ జాతీయ నాయకుల ఆహ్వానం మేరకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌  కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. అయితే పార్టీలో నెలకొన్న సంక్షోభంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. 

Updated Date - 2022-06-26T18:27:12+05:30 IST