Spice Jet: స్పైస్ జెట్ బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్య...

ABN , First Publish Date - 2022-09-01T17:04:21+05:30 IST

ఢిల్లీ (Delhi): స్పైస్ జెట్ (Spice Jet) బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

Spice Jet: స్పైస్ జెట్ బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్య...

ఢిల్లీ (Delhi): స్పైస్ జెట్ (Spice Jet) బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) నుంచి మహారాష్ట్ర (Maharashtra)లోని నాసిక్‌ (Nashik)కు స్పైస్‌జెట్ విమానం బయలుదేరింది. అయితే ఆటో పైలట్ సమస్య కారణంగా  విమానం నాసిక్ నుంచి తిరిగి ఢిల్లీకి వచ్చింది. బోయింగ్ 737 విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-09-01T17:04:21+05:30 IST