మసాలా బటర్‌మిల్క్‌

ABN , First Publish Date - 2021-03-28T05:44:53+05:30 IST

గ్లాసు చల్లని మజ్జిగ ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఈసారి మజ్జిగలో కాసిన్ని సుగుంధద్రవ్యాలు జోడించి టేస్టీ మసాలా బటర్‌మిల్క్‌ను ఆస్వాదించండి

మసాలా బటర్‌మిల్క్‌

గ్లాసు చల్లని మజ్జిగ ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఈసారి మజ్జిగలో కాసిన్ని సుగుంధద్రవ్యాలు జోడించి టేస్టీ మసాలా బటర్‌మిల్క్‌ను ఆస్వాదించండి. 


కావలసినవి: మజ్జిగ- ఒక కప్పు, చల్లని నీళ్లు- రెండు కప్పులు, పచ్చి మిరపకాయ ఒకటి, తరిగిన కొత్తిమీర - టేబుల్‌స్పూన్‌, జీలకర్ర పొడి- అరటీస్పూన్‌, బ్లాక్‌సాల్ట్‌- అరటీస్పూన్‌, చాట్‌ మసాలా- పావు టీస్పూన్‌, నాలుగైదు కొత్తిమీర, పుదీనా ఆకులు అలంకరణ కోసం.

 

తయారీ: మజ్జిగ, నీళ్లు, ఉప్పుతో పాటు అన్ని మసాలా దినుసులను మిక్సీలో వేయాలి. అంతే రుచికరమైన మసాలా బటర్‌మిల్క్‌ తయారవుతుంది. ఇప్పుడు మజ్జిగను గ్లాసుల్లో పోసి కొత్తిమీర, పుదీనాతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-03-28T05:44:53+05:30 IST