జిల్లాలో ఆధ్యాత్మిక సందడి

ABN , First Publish Date - 2022-05-22T05:25:55+05:30 IST

జిల్లాలో పలు మండలాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవి ధంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించే హనుమాన్‌ జయంతి కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

జిల్లాలో ఆధ్యాత్మిక సందడి
అర్వపల్లిలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా ఉత్సవ పూజల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

జిల్లాలో పలు మండలాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవి ధంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించే హనుమాన్‌ జయంతి కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. 

అర్వపల్లి, మే 21: అర్వపల్లి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల నిర్వహించే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు దీక్షశ్రీకరణ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, చైర్మన్‌ చిల్లంచర్ల విద్యాసాగర్‌, ఎంపీటీసీ కనుకు పద్మశ్రీనివాస్‌, అర్చకులు రాంబాబు, పవన్‌, ఉపసర్పంచ్‌ పులిచర్ల ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

ప్రారంభమైన హనుమజయంతి ఉత్సవాలు

సూర్యాపేటటౌన్‌: జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి దేవాలయంలో హనుమజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేకువజామున కలశస్థాపనతో పూజలు ప్రారంబించారు. అఖండ దీపారదన, సుందరాకాండ పారాయణం, విష్ణు సహస్రనామ, భగవద్గీత పారాయణంతో పాటు హనుమాన్‌ చాలీసాను పఠించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సుధాకర్‌ పీవీసీ చైర్మన్‌ మీలా మహదేవ్‌ దంపతులు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో లక్ష్మణ్‌రావు, ఆంజనేయులు, అర్చకులు ధరూరి రామానుజాచార్యులు, శ్రీధరాచార్యులు, వెంపటి సురేష్‌, రామూర్తి, గుండా శ్రీనివా్‌సలు, రవీందర్‌, చీకూరి సాయి పాల్గొన్నారు.

చిలుకూరులో కంఠమహేశ్వర స్వామికి బోనాలు

చిలుకూరు : మండలకేంద్రంలో కంఠమహేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా బోనాల కార్యక్రమం గౌడ కులస్థులు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా స్వామి విగ్రహాల వద్దకు వెళ్ళారు. కార్యక్రమంలో గౌడసంఘం అధ్యక్షుడు మరీదు సైదులు, కొండా శేషయ్య, వీరబాబు, సూర్యప్రకాశ్‌, లక్ష్మీనర్సు, రాములు, చిన్నపుల్లయ్య, ఈదయ్య, శ్రీరాములు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

బీమలింగేశ్వరస్వామి దశాబ్ది వేడుకలు 

హుజూర్‌నగర్‌ : పట్టణంలోని శ్రీపార్వతీ సహిత బీమలింగేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ పునర్నిర్మాణ దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కీతా మల్లికార్జున్‌రావు, ఈవో గుజ్జుల కొండారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీను, పద్మావతి, భారతి, సోమరాజు, సూర్యప్రకాశ్‌, నారపరాజు శ్రీనివాసరావు, గుండా శ్రీనివాసు, సతీ్‌షశర్మ, రాము పాల్గొన్నారు. 

కృష్ణతండాలో భక్తాంజనేయస్వామి ప్రతిష్ఠా మహోత్సవం

మఠంపల్లి: మండలంలోని కృష్ణతండాలో శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 23 నుంచి 25వరకు జరిగే ఈ ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. 25న  ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు కీర్తిధ్వజ, బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి, పోతురాజు, శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

వైభవంగా శ్రీమహాలక్ష్మి అమ్మవారి 16రోజుల పండుగ

కోదాడ రూరల్‌: మండలంలోని తొగర్రాయి గ్రామంలో శ్రీమహాలక్ష్మీదేవి అమ్మవారి ప్రతిష్ఠాపన జరిగి 16 రోజులు అవుతున్న సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకాలు, నివేదన, అష్టోత్తర పూజలు, అర్చనలు, ప్రత్యేక పూలతో అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. కార్యక్రమంలో కోదాడ పీఏసీఎస్‌ చైర్మన్‌ అవుల రామారావు, భక్తులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-22T05:25:55+05:30 IST