పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jan 15 2022 @ 00:05AM
హైస్కూల్‌ ఆవరణలో పూర్వ విద్యార్థులు

సమావేశమైన పూర్వ విద్యార్థులు

వలేటివారిపాలెం, జనవరి 14 : వలేటివారిపాలెం హైస్కూల్‌లో 1999-2004వ సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం జరిగింది. పూర్వ విద్యార్థులు హైస్కూల్‌ ఆవరణలో సుమారు రూ.1.60 లక్షలతో సభాప్రాంగణం కోసం షెడ్డు నిర్మించారు. ఆ షెడ్డును ఉపాధ్యాయులతో ప్రారంభించారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారి మదుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.