‘స్పెషల్‌’ బాదుడు

ABN , First Publish Date - 2021-06-22T06:33:54+05:30 IST

పండుగల సమయంలో నో, వేసవి సెలవుల్లోనో అదనపు సర్వీసులను రైల్వే శాఖ కల్పిస్తుంటుంది.

‘స్పెషల్‌’ బాదుడు

రెగ్యులర్‌గా తిరిగే రైళ్లకు

రెట్టింపు చార్జీల వసూలు

లబోదిబోమంటున్న ప్రయాణికులు

గిద్దలూరు, జూన్‌ 21 : పండుగల సమయంలో నో, వేసవి సెలవుల్లోనో అదనపు సర్వీసులను రైల్వే శాఖ కల్పిస్తుంటుంది. అందుకుగాను స్పెషల్‌  పేరిట అదనపు చార్జీలను వసూలు చేస్తుంది.  దాంతోపాటు తత్కాల్‌ పేరుతో కూడా డబుల్‌ చార్జీని వసూలు చేయడం అందరికీ తెలిసిందే.  కానీ కరోనా పేరు చెప్పి రెగ్యులర్‌గా తిరిగే రైళ్లకు స్పెషల్‌ పేరు పెట్టి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనాతో పనులు లేక, ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బం దులతో కుటుంబాలు రోజులు వెళ్లదీస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నిత్యావసర సరుకుల నుంచి ఇటు ఆర్టీసీ, రైల్వే సర్వీసుల ధరలు అందు బా టులో ఉంచాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కష్ట కాలంలో ధరలు పెంచడం, అదనపు చార్జీలు వ సూలు చేయడం బాధాకర మని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రైవేటు ఆపరేటర్లు ఉపయోగించుకున్న విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రైల్వేశాఖ కూడా ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రెట్టింపు చార్జీలు దండుకోవడం విమర్శలకు తావిస్తోంది. దశాబ్దాల తరబడి తిరుగుతున్న  రైళ్లకు కూడా స్పెషల్‌ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులపై భారం మోపడం సరికాదని పలువురు అంటున్నారు.  కరోనా కారణంగా గతంలో అన్ని రైళ్లను రైల్వేశాఖ నిలిపివేసింది.   కాలక్రమేణా ఉధృతి తగ్గడంతో ప్యాసింజర్‌ రైళ్లు మినహా దాదాపు అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. విజయవాడ - గిద్దలూరు - గుంతకల్లు బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గంలో ఒకటి, రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మినహా అన్ని ట్రైనర్లకు స్పెషల్‌ పేరు తగిలించి రెట్టింపు చార్జీలను వసూ లు చేస్తుండడంపై ప్రయాణికులు  ఇక్కట్లు పడు తున్నారు.   17215/17216 విజయవాడ - ధర్మవ రం మధ్య తిరిగే ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌, 17225/ 17226 విజయవాడ - హుబ్లీ మధ్య తిరిగే అమరావతి ఎక్స్‌ప్రెస్‌, 08047/08048 వాస్కోడిగామా - హౌరా మధ్య తిరిగే పెద్దఅమరావతి ఎక్స్‌ప్రె్‌సతో పాటు జూలై 1వ తేదీ నుంచి 07251/07252 గుం టూరు - గిద్దలూరు - కాచిగూడ మధ్య తిరగను న్న కాచిగూడ ఎక్స్‌ప్రె్‌సకు సైతం స్పెషల్‌ను తగి లించి తత్కాల్‌ టికెట్‌ తరహాలో రెట్టింపు చార్జీని వసూలు చేస్తున్నారు. వారానికి మూడు రోజులపాటు తిరిగే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌, నిత్యం తిరిగే ప్రశాంతి ఎక్స్‌ప్రె్‌సలకు మాత్రమే రైల్వేశాఖ మామూలు టి కెట్లు వసూలు చేస్తున్నది. పైన పే ర్కొన్న నాలుగు రైళ్లు కొన్ని దశాబ్దాల నుంచి ఈ రూ టులో రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా తిరుగుతున్న విష యం అందరికీ తెలిసిందే. 

రెట్టింపు కంటే ఎక్కువ చార్జీ

స్పెషల్‌ పేరుతో తిరుగుతున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ చార్జీలను రైల్వేశాఖ వసూ లు చేస్తున్నది. అంటే తత్కాల్‌ రేట్లను వసూలు చేస్తున్నది. గిద్దలూరు నుంచి విజయవాడకు స్లీప ర్‌ చార్జీ రూ. 180 ఉండగా స్పెషల్‌ పేరుతో రూ. 385  అదనంగా వసూలు చేస్తున్నారు. 3 టైర్‌ ఏసీ కోచ్‌లో ధర రూ.505 ఉండగా రూ.1050ని 2టైర్‌ ఏసీ కోచ్‌లో రూ.710 ఉండగా, రూ.1440 వసూలు చేస్తున్నారు. ఒక్క రైలు తిప్పితే రెండు రైళ్ల మేర ఆదాయాన్ని ప్రయాణికుల జోబు నుంచి రైల్వేశాఖ లాగేస్తోంది. ప్రతి రైలుకు స్పెషల్‌ పేరు తగిలించి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా ప్ర యాణికుల కష్టనష్టాలను మాత్రం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కనీసం మామూలు చార్జీలు వసూలు చేయాలని రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా ప్రజాప్రతినిధులు తీసుకువెళ్లకపోవడం విమర్శలకు తావిస్తున్నది. సరైన ర వాణా వ్యవస్థ లేక రెట్టింపు చార్జీలు పెట్టి ప్ర యాణించాల్సి వస్తుందని, రెగ్యులర్‌ రైలు చార్జీలకు ధరలను మార్చి ఆదుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. 


Updated Date - 2021-06-22T06:33:54+05:30 IST