ఇక స్పోర్ట్స్ వార్తలన్నీ ఒకే యాప్‌లో.. వచ్చేసిన ‘వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌’

ABN , First Publish Date - 2022-07-27T03:00:45+05:30 IST

సరికొత్త స్పోర్ట్స్ యాప్ ‘వాట్స్ ఇన్ ద గేమ్’ (Whats In The Game) వచ్చేసింది. 60 పదాలు, లేదంటే అంతకంటే త

ఇక స్పోర్ట్స్ వార్తలన్నీ ఒకే యాప్‌లో.. వచ్చేసిన ‘వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌’

హైదరాబాద్: సరికొత్త స్పోర్ట్స్ యాప్ ‘వాట్స్ ఇన్ ద గేమ్’ (Whats In The Game) వచ్చేసింది. 60 పదాలు, లేదంటే అంతకంటే తక్కువలోనే క్రీడలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. షెడ్యూల్స్, ఫలితాలు వంటివాటిని ఫింగర్ టిప్స్‌పైనే తెలుసుకోవచ్చు. స్పోర్ట్స్ మీడియా, టెక్ స్టార్టప్ అయిన ‘వాట్స్ ఇన్ ద గేమ్’ను ఆ సంస్థ వ్యవస్థాపకుడు  అనిల్‌ కుమార్‌ మామిడాల, ఈజేబీ ప్రమీల, అంతర్జాతీయ బాడ్మింటన్‌ ఆటగాడు, భాగస్వామి బి.సాయి ప్రణీత్‌ దీనిని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. 


ప్రస్తుతం క్రీడలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని అందించే యాప్స్ ఏవీ లేవు. ఈ నేపథ్యంలోనే ఈ అప్లికేషన్‌ను తాము అభివృద్ధి చేసినట్టు అనిల్ కుమార్ తెలిపారు. ప్రతి క్రీడాభిమానికి, అథ్లెట్‌కు ఈ యాప్ ఓ చక్కని పరిష్కారం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తొలి వెర్షన్‌ ‘వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌’లో ప్రస్తుతం సంక్షిప్త సమాచారం, షెడ్యూల్స్‌, ఫలితాలను అన్ని ఒలింపిక్‌, పారాలింపిక్‌, నాన్‌ ఒలింపిక్‌ క్రీడలు, వింటర్‌ గేమ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అతి సరళమైన స్వైపింగ్‌ అవకాశంతో అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని అప్‌డేట్లు తీసుకొస్తామని అన్నారు. యాప్ ప్రారంభంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వప్నం సాకారమైనందుకు సంతోషంగా ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. తాము ఇప్పటికే   మెటావర్స్, వెబ్‌ 3.0 టెక్నాలజీలపై పనిచేస్తున్నట్టు చెప్పారు.  


స్టార్టప్ భాగస్వామి సాయి ప్రణీత్‌  మాట్లాడుతూ.. ఓ అథ్లెట్‌గా, క్రీడాభిమానిగా ఈ ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తాము విభిన్నమైన ఫీచర్లను జోడిస్తామన్నాడు. సమీప భవిష్యత్‌లో  క్రీడా ప్రపంచంలో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. ‘వాట్స్ ఇన్ ద గేమ్’ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. 


Updated Date - 2022-07-27T03:00:45+05:30 IST