రేంజ్‌ పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

Published: Sat, 22 Jan 2022 23:19:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 రేంజ్‌ పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభంక్రీడా జ్యోతి వెలిగించి స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభిస్తున్న డీఐజీ త్రివిక్రమవర్మ

  హాజరైన డీఐజీ, ముగ్గురు ఎస్పీలు


గుంటూరు, జనవరి 22: గుంటూరు రేంజ్‌ పరిధిలోని రేంజ్‌ పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ శనివారం గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ క్రీడాజ్యోతి వెలిగించి బెలూన్లు ఎగురవేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు గుంటూరు అర్బన్‌, రూరల్‌తోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల జట్లు హాజరయ్యాయి. ఈ సందర్భంగా టగ్‌ ఆఫ్‌ వార్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, హైజంప్‌, లాంగ్‌ జంప్‌, హ్యామర్‌ త్రో, 200, 400 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ముందుగా క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో డీఐజీ త్రివిక్రమవర్మతోపాటు గుంటూరు అర్బన్‌, రూరల్‌, నెల్లూరు ఎస్పీలు ఆరిఫ్‌ హఫీజ్‌, విశాల్‌గున్నీ, విజయరావుతోపాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.