ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో ఇంకెన్నాళ్లు?

Published: Fri, 18 Feb 2022 03:48:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో ఇంకెన్నాళ్లు?

హర్మన్‌ను తప్పించాలంటున్న డయానా


న్యూఢిల్లీ: ఎప్పుడో నాలుగున్నరేళ్ల కిందట చేసిన 171 పరుగుల ఇన్నింగ్స్‌ను చూపుతూ సీనియర్‌ బ్యాటర్‌, టీ-20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ను జట్టులో కొనసాగించడాన్ని మాజీ  కెప్టెన్‌ డయానా ఎడుల్జీ తప్పుపట్టింది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ సెమీస్‌లో అజేయంగా 171 రన్స్‌చేసిన హర్మన్‌ జట్టును గెలిపించింది. కానీ ఆ తర్వాత ఆమె కేవలం మూడుసార్లే 50కిపైగా స్కోర్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఎడుల్జీ స్పందిస్తూ ‘హర్మన్‌ ఆట తీరు నిరాశకు లోను చేస్తోంది. ఎప్పుడో వరల్డ్‌ కప్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ను చూపు తూ ఆమెను కొనసాగించడం కరెక్ట్‌ కాదు. కివీస్‌తో మూడో వన్డేకు కౌర్‌ను తప్పించాలి’ అని  అభిప్రాయపడింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.