రష్యాపై కొరడా

ABN , First Publish Date - 2022-02-26T08:46:53+05:30 IST

రష్యాపై కొరడా

రష్యాపై కొరడా

చాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్‌ ఆతిథ్యం నుంచి అవుట్‌


లండన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డ రష్యా నుంచి చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఫైనల్‌ ఆతిథ్య హక్కులను వెనక్కు తీసుకుంటున్నట్టు యూరోపి యన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (యూఈ ఎఫ్‌ఏ) శుక్రవారం ప్రకటించింది. మే 28న ఈ ఫైనల్‌ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరగాల్సి ఉంది. కాగా.. సెప్టెంబరు 25న రష్యాలోని సోచిలో జరగాల్సిన ఎఫ్‌-1 రష్యన్‌ గ్రాండ్‌ప్రీని ఈసారి అక్కడ నిర్వహిం చడంలేదని అంతర్జాతీయ మోటార్‌ స్పోర్ట్స్‌ అసోసి యేషన్‌ కూడా ప్రకటించింది. 


అక్కడి ఈవెంట్లను రద్దు చేయండి: ఐఓసీ

ఉక్రెయిన్‌పై రష్యా వైఖరి పట్ల అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు.. రష్యాలో జరగాల్సిన అన్ని క్రీడా ఈవెంట్లను రద్దు చేయాలంటూ అంతర్జాతీయ క్రీడా సంఘాలన్నింటికీ ఐఓసీ విజ్ఞప్తి చేసింది. రష్యాకు మద్దతిస్తున్న బెలారస్‌లోనూ ఈవెంట్లను రద్దు చేయడమో లేదంటే ఇతర వేదికలకైనా తరలించాలని సూచించింది.  

Updated Date - 2022-02-26T08:46:53+05:30 IST