కడప స్పోర్ట్సు స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-07-01T06:50:03+05:30 IST

డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ కడప స్పోర్ట్సు స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ ఎస్‌ఏ. అజీజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

కడప స్పోర్ట్సు స్కూల్‌లో ప్రవేశానికి   దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ స్పోర్ట్సు, జూన్‌ 30 : డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ కడప స్పోర్ట్సు స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ ఎస్‌ఏ. అజీజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూలై 11 నుంచి 18వ తేదీ వరకు మండలాల వారీగా క్రీడాకారుల ఎంపిక చేయనున్నారని, మండలస్థాయిలో ఎంపికైన వారికి జూలై 19నుంచి 22వ తేదీ వరకు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన వారికి జూలై 25 నుంచి 26 వరకు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో ఎంపిక ఉంటుందని, పోటీల్లో పాల్గొనదలిచిన వారు తప్పనిసరిగా 2013 ఆగస్టు ఒకటో తేదీ నుంచి 2014 జూలై 31వ తేదీ మధ్యలో జన్మించిన వారై ఉండాలన్నారు. పూర్తి వివరాలకు ఇందిరాగాంధీ స్టేడియంలోని చీఫ్‌ కోచ్‌ను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2022-07-01T06:50:03+05:30 IST