రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-17T06:24:02+05:30 IST
జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి 6వ సబ్ జూనియర్ బాలి కలు, 7వ జూనియర్ బాలుర హ్యాండ్బాల్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి.
ఏలూరు స్పోర్ట్స్, అక్టోబరు 16 : జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి 6వ సబ్ జూనియర్ బాలి కలు, 7వ జూనియర్ బాలుర హ్యాండ్బాల్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఏలూరు సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీషు మీడియం హైస్కూ లులో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వై. లక్ష్మీ నారాయణ, కె. అలివేలు మంగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడు పెదబాబు, ఏఎస్పీ సుబ్బరాజు, సెట్వెల్ సీఈవో మెహ ర్రాజ్, డీఎస్ఏ చీఫ్ కోచ్ అజీజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. బాలికల విభాగంలో.. శ్రీకాకుళం జట్టుపై పశ్చిమ, కృష్ణాపై చిత్తూరు, గుంటూరుపై కృష్ణా, తూర్పుగోదావరిపై ప్రకాశం, నెల్లూరుపై పశ్చిమ, కడపపై అనంతపూర్, నెల్లూరుపై శ్రీకాకుళం, ప్రకాశంపై విశాఖ, గుంటూరుపై చిత్తూరు జట్లు విజయం సాధించాయి. బాలుర విభాగంలో... నెల్లూరుపై కర్నూలు, విశాఖపై గుంటూరు విజయం సాధించాయి. ఆదివారం ఫైనల్స్ జరగనున్నాయి. బడేటి వెంకట్రామయ్య, ప్రసాదరాజు, డీవైఈవో కుటుంబరావు, కార్పొరేటర్ కిరణ్, కోచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.