త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

ABN , First Publish Date - 2021-12-18T18:14:56+05:30 IST

కర్ణాటకలో అన్ని క్రీడలను ప్రోత్సహించే దిశగా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని క్రీడలు, యువజనశాఖల మంత్రి నారాయణగౌడ వెల్లడించారు. శుక్రవారం విధాన పరిషత్‌లో సభ్యురాలు వీణా అచ్చయ్య

త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

                         - క్రీడలు, యువజనశాఖల మంత్రి నారాయణగౌడ


బెంగళూరు: కర్ణాటకలో అన్ని క్రీడలను ప్రోత్సహించే దిశగా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని క్రీడలు, యువజనశాఖల మంత్రి నారాయణగౌడ వెల్లడించారు. శుక్రవారం విధాన పరిషత్‌లో సభ్యురాలు వీణా అచ్చయ్య కొడగులో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అన్ని కోణాలలోను పరిశీలిస్తున్నామన్నారు. కొడుగు జిల్లా వాసులు క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించినవారున్నారని గుర్తు చేశారు. అందుకే జిల్లాకు ప్రత్యేకంగా గ్రాంట్‌లు విడుదల చేస్తున్నామన్నారు. కానీ కొడుగులో యూనివర్సిటీ ఏర్పాటు విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీ డాకారులందరిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడా శిక్షకులు అంకితాసురేష్‌, కుట్టప్ప, గణపతిలకు లక్ష రూపాయలు ప్రోత్సాహంతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు శిక్షణ పొందుతున్న భవానీకి రెండులక్షల ఆర్థిక సాయం చేశామన్నారు. కొడుగు జిల్లా వాసుల క్రీడలకు అనుకూలంగా ఉండేలా దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు సౌలభ్యాలు కల్పిస్తున్నాయన్నారు. 

Updated Date - 2021-12-18T18:14:56+05:30 IST