గజ్వేల్‌లో 20 ఎకరాల్లో క్రీడాహబ్‌

ABN , First Publish Date - 2021-07-24T05:35:07+05:30 IST

గజ్వేల్‌లో 20 ఎకరాల్లో క్రీడాహబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వంటేరు ప్రతా్‌పరెడ్డితో కలసి క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి గజ్వేల్‌ పట్టణంలోని మినీ స్టేడియంను శుక్రవారం పరిశీలించారు.

గజ్వేల్‌లో 20 ఎకరాల్లో క్రీడాహబ్‌
గజ్వేల్‌ పట్టణంలో భూములను పరిశీలిస్తున్న కార్పొరేషన్‌ చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి

రూ.25 కోట్ల వ్యయంతో అన్ని క్రీడాప్రాంగణాలను నిర్మిస్తాం

భవిష్యత్తులో క్రీడాస్కూల్‌తో పాటు, ఫుట్‌బాల్‌ అకాడమీని ఏర్పాటు చేస్తాం

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి


గజ్వేల్‌, జూలై 23: గజ్వేల్‌లో 20 ఎకరాల్లో క్రీడాహబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వంటేరు ప్రతా్‌పరెడ్డితో కలసి క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి గజ్వేల్‌ పట్టణంలోని మినీ స్టేడియంను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్‌ను అన్ని రంగాలతో పాటు క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కేజీటూపీజీ వరకు ఎడ్యుకేషన్‌ హబ్‌లు పూర్తయ్యాయని, క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రిలను కోరినట్లు తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్‌ వెంటనే సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డిని గజ్వేల్‌ వెళ్లాలని సూచించారన్నారు. మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో సాట్స్‌ చైర్మన్లతో కలసి స్పోర్ట్‌ హబ్‌ను అభివృద్ధి చేసి, క్రికేట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌ మైదానాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అన్ని క్రీడలను గజ్వేల్‌ నుంచి త్వరలోనే ప్రారంభిస్తామని వంటేరు ప్రతా్‌పరెడ్డి తెలిపారు. అనంతరం క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నిధులు అన్ని సమకూరుస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో అన్ని రంగాలతో పాటు క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో స్థలాన్ని చూసి రావాలని సీఎం తనను ఆదేశించారన్నారు. సర్వే నెంబర్‌ 560/1లో 20 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. క్రీడారంగం అభివృద్ధి చెందాలని స్థానిక నాయకులు కుతూహలంతో ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డితో కలసి క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక ఎస్టీ అమ్మాయి సౌమ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడేందుకు ఏసియా కప్‌కు ఎంపికైందని, నిఖత్‌ జరీన్‌ బాక్సింగ్‌లో జాతీయస్థాయిలో రాణిస్తుందని, అథ్లెటిక్స్‌లో నందిత, భాగ్యలక్ష్మి, కీర్తిలు పటియాలాలో రాణించి, జాతీయస్థాయికి వెళ్లారన్నారు. బ్యాట్మింటన్‌కు దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేయడం, కశ్యప్‌, కౌశిక్‌లు ఇప్పటికే రాణించారన్నారు. టెన్నీ్‌సలో సానియామీర్జా ఎప్పుడో వెలిగిందన్నారు. గజ్వేల్‌ నుంచి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు వచ్చేలా క్రీడాభివృద్ధికి కృషిచేస్తామన్నారు. వారివెంట ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ జకీ, కౌన్సిలర్లు రజిత, రహీం, నాయకులు ఖాజావిరాసత్‌అలీ, మథీన్‌, గుంటుకు రాజు, రవీందర్‌, మల్లేశం, శ్రీధర్‌, వహీద్‌, నవాజ్‌మీరా, హన్మంత్‌రెడ్డి, జిలానీ తదితరులున్నారు. 


Updated Date - 2021-07-24T05:35:07+05:30 IST